Connect with us

Picnic

TAGH @ Houston: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ ఆధ్వర్యంలో పిక్నిక్ విజయవంతం

Published

on

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ (Telangana Association Of Greater Houston – TAGH) ఆధ్వర్యంలో ఏప్రిల్ 18, శనివారం రోజున జోన్స్ క్రీక్ పార్క్‌ వద్ద నిర్వహించిన పిక్నిక్ (Picnic) వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. 800 మందికి పైగా సభ్యులు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా ఆనందించారు.

ఈ సందర్భంగా పిల్లలు, మహిళలు, పురుషుల కోసం వివిధ రకాల ఆటలు నిర్వహించగా, అందరూ చురుకుగా పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హ్యూస్టన్‌ (Houston, Texas) లో ప్రసిద్ధి చెందిన బిర్యాని పాట్ రెస్టారెంట్ (Biryani Pot Restaurant) బృందం అందించిన రుచికరమైన వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

TAGH బోర్డు సభ్యులు, ట్రస్టీలు, సలహాదారులు అందరూ కలసి, క్రాంతి నెడ్నూర్ గారి నాయకత్వంలో ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా స్పాన్సర్లు, దాతలు, విక్రేతలు, వాలంటీర్లు, ఫోటోగ్రాఫర్లు అందరికీ TAGH హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

అలాగే, సృజన గారు మరియు వారి కుటుంబం అందించిన అద్భుతమైన DJ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. పాల్గొన్న వారందరి నుండి వచ్చిన ప్రశంసలు, సానుకూల స్పందనలు ఈ వేడుక ఘన విజయాన్ని స్పష్టంగా తెలియజేశాయి.

TAGH స్థాపన నుంచీ నిరంతరం అండగా నిలుస్తున్న TAGH కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారమే సంస్థ అభివృద్ధికి, ఇలాంటి విజయవంతమైన కార్యక్రమాలకు ప్రధాన బలం. సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారమే సంస్థ అభివృద్ధికి, ఇలాంటి విజయవంతమైన కార్యక్రమాలకు ప్రధాన బలం.

error: NRI2NRI.COM copyright content is protected