Connect with us

Cricket

డాలస్ లో క్రికెట్ ప్రేమికులు ఆస్వాదించేలా తానా క్రికెట్ ఛాంపియన్షిప్

Published

on

మే 31, 2022, డాలాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ డాలస్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో “క్రికెట్ టోర్నమెంట్” ఉత్సాహవంతులైన క్రీడాకారుల నడుమ మే 28 తేది నుంచి 30 మే తేదీ వరకు అద్భుతంగా నిర్వహించబడింది.

ముందుగా డాలాస్ RVP సతీష్ కొమ్మన, తానా జాతీయ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు, తానా DFW స్పోర్ట్స్ సమన్వయకర్త వెంకట్ బొమ్మ, రాజేష్ చెరుకుపల్లి క్రీడాకారులకు స్వాగతం పలికి క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంబిచారు.

రాబోయే కాలంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ సారధ్యంలో, తానా జాతీయ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ సమన్వయంతో మరిన్ని మంచి మంచి క్రీడా కార్యక్రమాలను మీముందుకు తీసుకు వస్తున్నాం అని తానా కార్యక్రమాలలో అందరు పాల్గొనవలసిందిగా కోరారు.

క్రీడాకారులు, ఔత్సాహికులు క్రికెట్ ఆట ఆడాలంటే డల్లాసులో మాత్రమే ఆడాలి అనుకునే విధంగా తెలుగు అసొసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అన్నిహంగులు కలిగిన స్థానిక రసెల్ క్రీక్ పార్కు క్రీడా సముదాయంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ ఆటలపొటీలకు గ్రాండ్ స్పాన్సర్ గా దేవాన్ష్ ల్యాబ్స్, గోల్డ్ స్పాన్సర్ గా టెక్ స్టార్, ఈవెంట్ స్పాన్సర్స్ గా శ్రీకాంత్ పోలవరపు, సతీష్ కొమ్మన వ్యవహరించారు.

ఇరవై జట్లు, మూడు వందల యాభై మంది క్రీడాకారులు, స్వచ్చంద కార్యకర్తలు అమితమైన ఉత్చాహంతో పాల్గొన్నారు. అహో అనే విధముగా మంచి ప్రావీణ్యముతో సిక్సులు, ఫోర్లతో బలమైన షాట్లు కొడుతూ క్రీడాకారులు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

తానా విన్నర్ కప్ ను టెక్నీ హైర్ టైగర్స్ (కెప్టెన్ గంగాధర్ వంకా & టీమ్) , రన్నర్ అప్ కప్ ను విల్లో వారియర్స్ (కెప్టెన్ రాజా అడైకలసామీ &టీమ్) జట్లు గెల్చుకున్నాయి. విన్నర్స్ టీమ్ కు $1500 ప్రైజ్ మనీ తో పాటు ట్రోఫీ మరియు మెడల్స్, రన్నర్ అప్ టీమ్ కు $750 ప్రైజ్ మనీ తో పాటు ట్రోఫీ మరియు మెడల్ ఇచ్చి ఘనంగా సత్కరించారు. బెస్ట్ బ్యాట్స్‌మన్ ఆఫ్ ది సీరీస్ గా విల్లో వారియర్ టీమ్ నుంచి ఏకలవ్య, బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సీరీస్ గా రాజా అడైకలసామీ, ఆల్ రౌండర్ ఆఫ్ ది సీరీస్ గా టెక్నీ హైర్ టైగర్ టీమ్ ఆటగాడు శివ శంకర్ కొమరి గెల్చుకొని అందరి మన్ననలు పొందారు.

తానా డాలస్ RVP సతీష్ కొమ్మన, తానా జాతీయ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ, తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, తానా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ మురళి వెన్నం క్రీడలు మానసిక వికాసానికి తోడ్పడతాయని, పాల్గొన్న అందరికీ దన్యవాదాలు తెలియజేసి, విజేతలను అభినదించారు.

తానా డాలస్ వివిద కమిటీ సబ్యులు లెనిన్ వీర, చినసత్యం వీర్నపు, ప్రమోద్ నూతేటి, సుధీర్ చింతమనేని, దిలీప్ చండ్ర క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తానా DFW స్పోర్ట్స్ సమన్వయకర్త వెంకట్ బొమ్మ స్వచ్చంద కార్యకర్తలు, గ్రౌండ్ ఇచ్చిన సిటీ ఆఫ్ ప్లేనో, కుల్జీత్ సింగ్, అంపైర్ల్, TV9, TV5 మీడియా వారికి, స్పాన్సర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected