Connect with us

Associations

తామా సంక్రాంతి సంబరాలు అదరహా

Published

on

జనవరి 18 న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు అదరహా అన్నట్టు జరిగాయి. స్థానిక నార్క్రాస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ సంబరాలను శూరా ఇన్వెస్ట్మెంట్స్, మై టాక్స్ ఫైలర్, మాగ్నమ్ ఓపస్ ఐటీ మరియు సంక్రాంతి రెస్టారెంట్ వారు సమర్పించారు.

ముందుగా పిల్లలకు ప్రత్యేకంగా నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ కళ మరియు ది యంగ్ లీడర్స్ అకాడమీ ఉపన్యాసం పోటీలలో పిల్లలు పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ముగ్గుల పోటీలు మరియు మెహందీ లో మహిళలు విరివిగా పాల్గొన్నారు. లక్కీ ఛార్మ్స్ మాధురి గారి వేదిక అలంకరణ మరియు బైట్గ్రాఫ్ ప్రశాంత్ కొల్లిపర గారి ఆడియో వీడియో డిజిటల్ స్క్రీన్స్ ఈవెంటుని మరింత ఎలివేట్ చేసాయి. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు 24వ వర్ధంతి సందర్భంగా అట్లాంటా ఎన్టీఆర్ ట్రస్ట్ అభిమానులు నివాళులు అర్పించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు, రాఫుల్ బహుమతులు, షాపింగ్ స్టాల్ల్స్, రుచికరమైన భోజనాలు అలాగే ఇండియా నుంచి విచ్చేసిన గాయనీ గాయకులు దామిని, ధనుంజయ్ ల సంగీత విభావరి మరియు ఆల్రౌండర్ లోహిత్ రెడ్డి వ్యాఖ్యానం, మిమిక్రీ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. 2020లో మొట్టమొదటి కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించిన అధ్యక్షులు భరత్ మద్దినేని మరియు చైర్మన్ రాజశేఖర్ చుండూరి సారధ్యంలోని తామా కార్యవర్గం అభినందనీయులు.

error: NRI2NRI.COM copyright content is protected