Connect with us

College

43 ఏళ్ళ SRKR ఇంజినీరింగ్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు, న్యూ జెర్సీలో మొదటి సమావేశం: North America

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్(SRKR Engineering College) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతదేశంలోని ప్రైవేట్ కళాశాలల్లోకెల్లా ఉన్నతమైన ప్రమాణాలతో యువతను తీర్చిదిద్దుతుంది.

ఇంజినీరింగ్ చదువుల గురించి పెద్దగా తెలియని రోజుల్లో 1980 లోనే స్థాపించిన ఈ కళాశాల ఇంతింతై వటుడింతై అన్న చందంగా స్వయంప్రతిపత్తి (Autonomous) కలిగిన స్థాయికి చేరుకొని వివిధ రంగాలలో నిష్ణాతులను తయారుచేస్తున్న ఘనతని సొంతం చేసుకుంది.

ఈ 43 ఏళ్ళ ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకొని ప్రస్తుతం ఉత్తర అమెరికాలో (North America – USA, Canada, Mexico) ఉన్న పూర్వ విద్యార్థులు ఎస్ఆర్కేఆర్ఈసీ ఆలంనై అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (SRKREC Alumni Association of North America – SAANA) పేరుతో ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ ఏర్పాటు చేశారు.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, టాంపా నగరంలోని చిరునామాతో ఎస్ఆర్కేఆర్ఈసీ ఆలంనై అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (SAANA Inc.) ని 501(c)(3) లాభాపేక్షలేని సంస్థగా నమోదు చేశారు. ఈ మధ్యనే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (IRS) నుంచి అధికారికంగా ఆమోదం కూడా పొందడం విశేషం.

ఇంతకు ముందు లింక్డ్ఇన్, బ్రాంచెస్ వారీగా, బ్యాచెస్ వారీగా వివిధ సమూహాలగా ఉన్నప్పటికీ అన్ని బ్రాంచెస్లో వివిధ సంవత్సరాలలో ఉత్తీర్ణులై ఉత్తర అమెరికాలో ఉన్న పూర్వ విద్యార్థులు (Alumni) అందరినీ కలుపుతూ మొట్టమొదటిసారిగా, అధికారికంగా ఎస్ఆర్కేఆర్ఈసీ ఆలంనై అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (SAANA) ని ఏర్పాటు చేయడం అభినందనీయం.

సానా (SAANA) లో సభ్యత్వం కొరకు www.TheSAANA.org/SANAMembership ని సందర్శించండి. అలాగే మొట్టమొదటి పూర్వ విద్యార్థుల సమావేశం (Alumni Meet) మే 27న న్యూ జెర్సీ లో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) అంగరంగ వైభవంగా నిర్వహించనున్న కన్వెన్షన్ లో ఏర్పాటు చేశారు.

సభ్యత్వం తీసుకొని ఈ సమావేశానికి కూడా హాజరవ్వాల్సిందిగా సానా ఫౌండింగ్ కార్యవర్గం (Executive Committee) మరియు బోర్డు సభ్యులు (Board of Directors) కోరుతున్నారు. ఈ సమావేశంలో ఇండియా కాలేజీ నుంచి కొంతమంది ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ, మానేజ్మెంట్ కూడా పాల్గొననున్నారు.

సానా (SAANA) మొట్టమొదటి పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు www.TheSAANA.org/SANA1stAlumniMeet లో మీ పేరు నమోదు చేసుకోండి. ఒక్కసారి అందరం కలిసి మన ఆటోగ్రాఫ్ జ్ఞాపకాలను కుటుంబ సమేతంగా నెమరువేసుకుందామా? మరిన్ని వివరాలకు saana.org@gmail.com కి ఈమెయిల్ చెయ్యండి లేదా +1(571)250-6370 కి కాల్ చెయ్యండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected