Connect with us

Associations

శశాంక్ యార్లగడ్డ: తానా ఎలక్షన్స్ లో మెరుస్తున్న టీం నిరంజన్ యువతేజం

Published

on

తానా ఎలక్షన్స్ లో క్రీడా కార్యక్రమాల సమన్వయకర్తగా నిరంజన్ ప్యానెల్ నుండి శశాంక్ యార్లగడ్డ బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత తానా యువనాయకత్వ ప్రోత్సాహక కమిటీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ యువతేజం ఇప్పుడు ఓ మెరుపు మెరుస్తున్నారు. తనదైన స్టైల్ లో అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ ప్రసంగాలతో ఎలక్షన్ క్యాంపైన్ లో దూసుకెళ్తున్నారు. గత రెండు నెలలుగా ఎడతెరిపి లేకుండా టీం నిరంజన్ తోపాటు అమెరికా మొత్తం చుట్టేశారు.

ఇక్కడే పుట్టి పెరిగిన యువత తానాలో ఇంత యాక్టీవ్ గా ఉన్న దాఖలాలు ఇప్పటివరకు లేవనే చెప్పాలి. దీనికి భిన్నంగా అమెరికాలోని ప్రవాస తెలుగు యువతను తానా వైపు నడిపేందుకు మరియు క్రీడాపరమైన కార్యక్రమాలు తానాలో విరివిగా చేపట్టే లక్ష్యాలతో టీం నిరంజన్ కు ఒక మంచి బలం అయ్యారు. తను గెలిస్తే తదుపరి తరానికి చెందిన తెలుగు బిడ్డ మొట్టమొదటిసారిగా తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ లో పదవిని అలంకరించినట్టవుతుందని అంటున్నారు.

చికాగోలో హైస్కూల్ విద్యను, జాక్సన్ మిస్సిస్సిప్పిలో కాలేజీ విద్యను అభ్యసించిన శశాంక్ క్రికెట్, అమెరికన్ ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో సత్తా చాటారు. జాక్సన్ విశ్వవిద్యాలయ క్రికెట్ జట్టులోనే గాక స్థానిక జట్లలో కూడా శశాంక్ ఉత్సాహవంతమైన క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. స్థానికంగా తానా ఆధ్వర్యంలో ఆహార పంపిణీ, బ్యాక్‌ప్యాక్‌ల వితరణ లాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. శశాంక్ లాంటి యువ ప్రవాస క్రీడాకారులను తానాలో ప్రోత్సహిస్తే ముందుముందు ఇంకా చాలా మంది యువత తానా వైపు మళ్లే అవకాశం ఉంటుందని, కావున శశాంక్ యార్లగడ్డ తోపాటు టీం నిరంజన్ కి వోట్ వేస్తే బాగుంటుందని పలువురు ప్రవాసులు బలంగా నమ్ముతున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected