Connect with us

Devotional

Poland, Europe: మొదటిసారి ఘనంగా పోటా వినాయక చవితి వేడుకలు

Published

on

పోలండ్ దేశంలో మొట్ట మొదటిసారిగా పోలండ్ తెలుగు అసోసియేషన్ (పోటా) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. పోటా ఫౌండర్ ప్రెసిడెంట్ చంద్ర భాను గారు లిటిల్ ఇండియా చందు గారు ఆధ్వర్యంలో పోలాండ్ లోని మూడు ముఖ్యమైన నగరాల్లో (వర్సా, క్రకోవ్ మరియు గడన్స్) లో వియనాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

పోటా (Poland Telugu Association) ఆధ్వర్యంలో వందలాది ప్రవాస భారతీయులు ఆనందంతో, భక్తి శ్రద్ధలతో వియనాయకుని పూజలు నిర్వహించారు. తెలుగువారు దంపతులతో విద్యార్థులు, ఐటి ఉద్యోగులు భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుండి భక్తులు, పోలాండ్ దేశస్తులు కూడా పాల్గొన్నారు.

వీరందరూ ఆ గణేశునికి (Lord Ganesh) సంబంధించిన భజనలు, భక్తి గీతాలను ఆలపించి హిందూ (Hindu Culture) సంస్కృతి సాంప్రదాయాలను, మన పండగల విశిష్టతను పెద్ద ఎత్తున తెలియజేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది.

పోలాండ్ రాజధాని వార్సా (Warsaw) లో వినాయక మండపంలో మహా హారతి, లడ్డూ వేలం పాటలో ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు, ఐటి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నృత్యాలు చేయడం జరిగింది. స్వామి వారి లడ్డూ ని వార్సా లో హరిచంద్ కాట్రగడ్డ (లిటిల్ ఇండియా) వేలం పాటలో 6000 zl (సుమారు 1,20,000) దక్కించుకున్నారు.

అశేషంగా హాజరైన భక్తుల సమక్షంలో వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు. విదేశాల్లో కూడా భారతీయ సంసృతిని ఎన్‌ఆర్‌ఐ (NRI) లు మరవకుండా ఇటువంటి గొప్ప సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పోటా ఫౌండర్, అధ్యక్షుడు చంద్రభాను, ఫౌండర్ చందు సంతోషాన్ని వక్త్యపరిచారు.

ఈ వినాయక చవితి పండగ మన తెలుగువారినే కాక భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడ కు వచ్చిన ప్రవాస భారతీయులను పోలాండ్ దేశస్థులను మన హిందూ సంప్రదాయ పట్ల విపరీతంగా ఆకట్టుకుంది అని పోటా (Poland Telugu Association) ప్రతినిధులు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected