Connect with us

People

మే 20న NTR శత జయంతి ఉత్సవాలు @ Birmingham, Alabama

Published

on

అనేక తరాలను ఉర్రూతలుగించిన నటుడిగా, రాష్ట్ర మరియు దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన రాజకీయ నాయకుడిగా, విలువలు, క్రమశిక్షణ, సమాజం పట్ల భాద్యత కలిగిన వ్యక్తిగా ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) తెలుగు వారి మీద చెరగని ముద్ర వేశారు.

రాజకీయ అభిప్రాయాయాలని పక్కన పెడితే ఎన్టీఆర్ అందరివాడు, ఆదర్శప్రాయుడు. తెలుగు వారి కోసం నిరంతరం తపన పడ్డ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలను మే 20న అలబామా రాష్ట్రంలోని బర్మింగ్హామ్ పట్టణంలో నిర్వహిస్తున్నారు.

ఈ ఉత్సవాలలో భాగంగా బర్మింగ్హామ్ డౌన్టౌన్ లోని స్థానిక జిమ్మీ హేల్ మిషన్ (Jimmie Hale Mission) లో అన్నదానం (Food Donation) చేస్తున్నారు. అందరూ శకపురుషుని శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected