Connect with us

Birthday Celebrations

అట్లాంటాలో శకపురుషుని శతజయంతి మే 13న; బంతి భోజనాలు, టాలీవుడ్ సింగర్స్ మ్యూజికల్ ట్రిబ్యూట్: NTR Trust Atlanta

Published

on

అటు సినీ, ఇటు రాజకీయ రంగాల్లో రారాజు అయిన ఎన్టీఆర్‌ (Nandamuri Taraka Ramarao) ఘన చరిత్రను ముందు తరాలు తెలుసుకునేలా NTR Trust Atlanta ఆధ్వర్యంలో శకపురుషుని శతజయంతి వేడుకలు మే 13, శనివారం రోజు సాయంత్రం 4 గంటల నుండి స్థానిక లాంబర్ట్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

అమెరికాలో జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా మహానగరంలో 2008 లోనే NTR Trust స్థాపించి ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలు ఒక ఎత్తు. ఇప్పుడు విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, పద్మశ్రీ, అన్న స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 100వ పుట్టినరోజు వేడుకల (Centennial Birthday Celebrations) నిర్వహణ మరొక ఎత్తు.

ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవం, ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం, సంక్షేమ పధకాలకు తారక మంత్రం ఎన్టీఆర్. అటువంటి మహనీయుని 100 సంవత్సరాల ఘన చరిత్రని ఘనంగా చాటుతున్నారు NTR Trust Atlanta వారు. పిల్లలకు ఫేస్ పెయింటింగ్, ఎన్టీఆర్ ఆర్ట్ కాంపిటీషన్ వంటి ఆహ్లాదకరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

గుడివాడ నియోజకవర్గ నాయకులు, వెనిగండ్ల ఫౌండేషన్ ఛైర్మన్ వెనిగండ్ల రాము, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష మరియు గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళ ప్రెసిడెంట్ అన్నాబత్తుని జయలక్ష్మి తోపాటు అమెరికాలోని పలు నగరాల నుండి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, టాలీవుడ్ సింగర్స్ ధనుంజయ్ మరియు వైష్ణవి ల మ్యూజికల్ ట్రిబ్యూట్, బంతి భోజనాలుప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.

తెలుగువాడి సత్తాని ప్రపంచ వ్యాప్తం చేసిన తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రిని స్మరించుకోవడానికి మే 13న నిర్వహించే NTR సెంటెన్నియల్ సెలబ్రేషన్స్ లో పాలుపంచుకొని, అన్న గారిని, ఆయన సాధించిన అద్భుత విజయాలను స్మరించుకుంటూ తెలుగు జాతి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియ చేద్దాం అంటున్నారు నిర్వాహకులు.

అందరికీ ప్రవేశం మరియు బంతి భోజనం ఉచితం. రెజిస్ట్రేషన్ తప్పనిసరి. అట్లాంటా వాసులందరూ శకపురుషుని శతజయంతి వేడుకలలో పాల్గొని తెలుగువారి ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ కి ఘన నివాళులు అర్పించాలని కోరుతున్నారు మన NTR Trust Atlanta వారు. రెజిస్ట్రేషన్ కొరకు www.NRI2NRI.com/NTR100ByNTRTrustAtlanta ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected