Connect with us

Food Bank

లార్డ్స్ ప్యాంట్రీ కి 6 వేల డాలర్ల విరాళం, ఫిలడెల్ఫియాలో నాట్స్ దాతృత్వం

Published

on

ఫిలడెల్ఫియా, జూన్ 10: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదానికి తగట్టుగా అమెరికాలో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతోంది. దీనిలో భాగంగానే ఫిలడెల్ఫియా చాఫ్టర్ నాట్స్ విభాగం పేదల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రోగ్రామ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల చొరవతో ఫిలడెల్ఫియాలో లార్డ్స్ ప్యాంట్రీ, డౌనింగ్ టౌన్‌కు 6,282 డాలర్లను విరాళంగా అందించారు.

పేదల ఆకలి తీర్చే లార్డ్స్ ప్యాంట్రీకి విరాళాలు ఇచ్చేందుకు నాట్స్ సభ్యులు, వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు. నాట్స్ ఇలా సేకరించిన 6,282 డాలర్ల మొత్తాన్ని లార్డ్స్ ఫ్యాంట్రీ డౌనింగ్ టౌన్‌కి విరాళంగా అందించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ నేషనల్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ రామ్ కొమ్మనబోయిన, ఫిలడెల్ఫియా నాట్స్ కో ఆర్డినేటర్ అరవింద్ పరుచూరి, జాయింట్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ చుండూరి, రామకృష్ణ గొర్రెపాటి, రవి ఇంద్రకంటి, మధు కొల్లి, కీలక పాత్ర పోషించారు.

ఈ విరాళాల సేకరణ కార్యక్రమానికి తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ ప్రెసిడెంట్ ముజీబుర్ రహమాన్, సంయుక్త కార్యదర్శి మధు బుదాటి, సంయుక్త కోశాధికారి సురేష్ బొందుగుల, కమిటీ సభ్యులు రమణ రాకోతు, సుదర్శన్ లింగుట్ల, గౌరీ కర్రోతు తదితరులు తమ పూర్తి సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ నూతన అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి దాతలను అభినందించారు.

ఇంకా సర్ఫర్ హరి & లావణ్య మోటుపల్లి, బావర్చి బిర్యానీ శ్రీధర్ & సుధ అప్పసాని, డివైన్ ఐటీ సర్వీసెస్ రాధిక బుంగటావుల, లావణ్య బొందుగుల, సునీత బుదాటి, కమల మద్దాలి, వంశీధర ధూళిపాళ, సతీష్ & కవిత పాల్యపూడి, విజయ్ & అంజు వేమగిరి, రవి & రాజశ్రీ జమ్మలమడక, సరోజ & శ్రీనివాస్ సాగరం, భార్గవి రాకోతు, లవకుమార్ & సునీత ఇనంపూడి, నీలిమ & సుధాకర్ వోలేటి, బాబు & హిమబిందు మేడి, లక్ష్మి ఇంద్రకంటి, నెక్స్ట్ లెవెల్ ఫైనాన్సియల్ అడ్వైజర్స్, మూర్తి చావలి & హరిణి గుడిసేవ, దీప్తి గొర్రెపాటి, దీక్ష కొల్లి, లలిత & శివ శెట్టి, మూర్తి & వాణి నూతనపాటి, దీపిక సాగరం & వినయ్ మూర్తి, అపర్ణ సాగరం & నిఖిల్ చిన్మయ వంటి పలువురు తమ దాతృత్వం చాటుకున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected