Connect with us

Associations

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఆంధ్ర, తెలంగాణావాదం

Published

on

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు గత కొన్ని సంవత్సరాలుగా వేడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సంవత్సరం మరీ స్పెషల్, ఎందుకంటే ఏకంగా 5 గురు ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీపడడం ఒక ఎత్తైతే, సీవీఎల్‌ నరసింహారావు తెలంగాణావాదాన్ని తెరపైకి తీసుకురావడం ఇంకో ఎత్తు. సెప్టెంబర్‌లో జరగనున్న ‘మా‌’ ఎన్నికల బరిలో అధ్యక్ష పదవి కోసం ఇంకా ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌ మరియు హేమ పోటీపడుతున్నారు. ఇప్పటివరకు లోకల్ నాన్లోకల్ అంటూ ప్రకాష్‌రాజ్‌ పై కామెంట్స్ వస్తున్న తరుణంలో, నటుడు, న్యాయవాది అయిన సీవీఎల్‌ నరసింహారావు అకస్మాత్తుగా రేసులోకి వచ్చారు. తెలంగాణ కళాకారులకు అన్యాయం జరుగుతోందనే నినాదంతో, ఆ రాష్ట్ర కళాకారుల కోసం ప్రత్యేకంగా ఒక అసోషియేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ముందు ముందు ఇంకెంతమంది పోటీ చేస్తారో ఏమేమి డిమాండ్స్ చేస్తారో!

error: NRI2NRI.COM copyright content is protected