Connect with us

Matrimony

ఉచితంగా మూడోసారి కాకతీయ సేవా సమితి వివాహ పరిచయ వేదిక, 300+ హాజరు @ Frisco, Dallas, Texas

Published

on

Dallas, Texas: కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ కొమ్మినేని నేతృత్వంలో నిర్వహించిన ‘వివాహ పరిచయ వేదిక–3’ కార్యక్రమం అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రం ఫ్రిస్కో (Frisco) లో విజయవంతంగా జరిగింది.

సుమారు 300 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం వివాహ (Marriage) సంబంధాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు (Parents) పరస్పరం పరిచయాలు పెంపొందించుకునేందుకు చక్కని వేదికగా నిలిచింది.

ఫ్రిస్కోలోని హిల్టన్ గార్డెన్ ఇన్‌ (Hilton Garden Inn, Frisco) లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబాల మధ్య పరిచయాలు (Introductions), పరస్పర అవగాహన పెంపొందించడం ద్వారా వివాహ సంబంధాల అన్వేషణను సులభతరం చేయడమే ఈ వేదిక ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమానికి వీణ యలమంచిలి (Veena Yalamanchili) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రిజిస్ట్రేషన్ బాధ్యతలను సువర్ణ, సుధ, అరుణ, పల్లవి నిర్వహించి అతిథులకు (Guests) స్వాగతం పలికారు. వధూవరులు, వారి తల్లిదండ్రుల మధ్య పరిచయాలు సజావుగా సాగేందుకు ప్రతిమ కొల్లి, లక్ష్మి కోటపాటి, శిరీష గడిపూడి, రేవతి ముమ్మనేని సహకరించారు.

ఈ వివాహ పరిచయ కార్యక్రమ నిర్వహణలో అమ్మిరాజు ములకల (Ammiraju Mulakala), శ్రీనివాస్ కొమ్మినేని, రవి చిట్టూరి, సురేష్,జగదీష్, వెంకట్, ప్రసాద్, ఉదయ్, రవికిరణ్, గిరి, రామ్, రామకృష్ణ, సత్య, లక్ష్మణ్, అనంత్,అశోక్, శివరావమ్మ, శ్వేత, బాల, శరత్,నాగేష్ కీలక పాత్ర (Key Role) పోషించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ కొమ్మినేని (Srinivas Kommineni) మాట్లాడుతూ, ఒకే వేదికపై వధూవరులు (Bride and Groom), వారి తల్లిదండ్రులు పరస్పరం పరిచయం చేసుకోవడం వల్ల వివాహ సంబంధాల అన్వేషణ మరింత సులభతరమవుతుందని తెలిపారు.

కమ్మవారి వివాహ పరిచయాల కోసం ఏడాది పొడవునా ఆన్‌లైన్‌ (Online) లో పేర్ల నమోదు చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు https://kakatiyasevasamithi.org/kakatiyamatrimony/ ద్వారా తమ వివరాలను నమోదు (Register) చేసుకోవచ్చని సూచించారు.

అమ్మిరాజు మాట్లాడుతూ, ‘వివాహ పరిచయ వేదిక’ కార్యక్రమాన్ని వరుసగా మూడో సంవత్సరం కూడా విజయవంతం (Successful) గా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులు, వారి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.

ఇకముందు కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఉచితం (Free) గానే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమ విజయానికి సహకరించిన వధూవరులు, వారి తల్లిదండ్రులు, అతిథులు, ఈవెంట్‌స్విఫ్ట్, మేఘమాల డెకార్స్, కాకతీయ వారియర్స్ సభ్యులకు కాకతీయ సేవా సమితి నిర్వాహకులు కృతజ్ఞతలు (Thanks) తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected