Connect with us

Associations

అట్లాంటాలో గేట్స్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

Published

on

అట్లాంటాలో జూన్ 9న గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగాయి. స్థానిక సౌత్ ఫోర్సైత్ మిడిల్ స్కూల్ లో జరిగిన ఈ వేడుకలకు కవి, రచయిత జొన్నవిత్తుల గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు గాయకులు జనార్దన్ పన్నెల, శ్రీనివాస్ దుర్గం ఆలపించిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. కాకతీయ రెస్టారెంట్ వారు అందించిన విందు భోజనం బహు పసందుగా ఉండెను. గేట్స్ ప్రెసిడెంట్ నంద చట్ల మరియు చైర్మన్ శ్రీధర్ నేలవెల్లి ఈ కార్యక్రమానికి తమ పూర్తి సహకారం అందించిన మహేందర్, రఘు, వెంకటేష్, సాయి, అజయ్, మణి, సాయి లీల, సుష్మ, గ్రీష్మ ,సుధాకర్, స్నేహ, రవీందర్, వినయ్, సందీప్, అపర్ణ, రజని కాంత్, నిరంజన్, ఫోటోగ్రఫీ సేవలందించిన వాకిటి క్రియేషన్స్ శ్రీధర్ రెడ్డి వాకిటి మరియు స్పాన్సర్స్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected