Connect with us

Financial Assistance

అనాధలకు పురుషోత్తమ చౌదరి గుదే & అనంతపూర్ ఎన్నారైల చేయూత

Published

on

తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులకు పురుషోత్తమ చౌదరి గుదే (Purusothama Chowdary Gude) ఆధ్వర్యంలో అనంతపూర్ ఎన్నారైలు చేయూతనందించారు. ప్రవాసాంధ్రుల సహకారంతో ఒక్కొక్క చిన్నారికి రూ. 3 లక్షల చొప్పున రూ. 6 లక్షలు అందజేశారు.

వివరాలలోకి వెళితే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపూర్ జిల్లా శెట్టూరు మండలంలోని బసంపల్లి గ్రామానికి చెందిన పాలబండ్ల మధుసూదన్, పద్మక్కలు ఈ మధ్యనే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో తమ ఇద్దరు కుమార్తెలు ఆనాధలుగా మారారు. చిన్నారులు ప్రస్తుతం వారి పెద్ద నాన్న శ్యాంసుందర్ సంరక్షణలో ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రవాసాంధ్రులు, తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుదే తన మిత్రుల (Anantapur NRIs) సహకారంతో చిన్నారులు పాలబండ్ల అశ్విని, లక్ష్మి లకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు చొప్పున రూ. 6 లక్షలు అందజేశారు. అలాగే చిన్నారులకు రూ. 10 వేల విలువ చేసే దుస్తులు అందజేశారు.

ముందు ముందు ఏమి అవసరమైన నన్ను సంప్రదించండి అంటూ హామీ ఇచ్చారు. ఈ సహాయం అందజేసిన వారిలో జ్ఞానభారతి విద్యాసంస్థ ల అధినేత రమేష్ బాబు, కొండయ్య, అచ్ఛంపల్లి రమేష్, కొల్లి వెంకటేష్ చౌదరి, వెంకట్ మాలపాటి మరియు కమ్మ సంఘం నాయకులు ఉన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected