Connect with us

Health

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో డిజిటల్ రేడియోగ్రఫీని ప్రారంభించిన బాలక్రిష్ణ

Published

on

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కిరీటంలో మరొక మణిపూస చేరిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అన్నారు చైర్మన్ నందమూరి బాలక్రిష్ణ. ఆసుపత్రిలోని రేడియాలజీ డిపార్ట్మెంట్ లో ఇప్పటికే అత్యాధునికమైన 3డి డిజిటల్ మమ్మోగ్రామ్ ఉంది. ఈ రోజు డిజిటల్ రేడియోగ్రఫీని ప్రారంబించారు. ఆసుపత్రి సీఈఓ డాక్టర్ ఆర్ వి ప్రభాకరరావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు మరియు రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ వీరయ్య చౌదరికి అభినందనలు తెలియజేసారు.

ఇంకా బాలక్రిష్ణ మాట్లాడుతూ “ఎలాంటి కొత్త సాంకేతికతనైనా ఆసుపత్రికి తీసుకురావడంలో ముందే ఉంటాము. ఇలాంటి అత్యాధునిక సాంకేతికత సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనేదే నాన్నగారి యొక్క ఆశయం. ఏ ఆశయంతో అయితే ఈ ఆసుపత్రి స్థాపించబడిందో, అదే స్పూర్తితో ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తూన్నాము. అత్యాధునిక సాంకేతికతతో అత్యంత నిపుణులైన డాక్టర్లచే అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఉండాలనేదే ఈ ఆసుపత్రి యొక్క ఆశయం. ఈ దిశగా ప్రయత్నం కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రతి రోజు ఎన్నో వందలమంది రోగులకు వారి యొక్క ఆర్ధిక పరిస్థితితో సంబంధం లేకుండా ఈ ఆసుపత్రిలో చికిత్స చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ద్వారా సాధారణంగా ఫిల్మ్ పైన తీసే ఎక్సరేని డిజిటల్ రూపంలో వెంటనే చూసే వీలుంటుంది. అలాగే ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ద్వారా తీసే ఇమేజ్ మంచి క్వాలిటీతో ఉండి ఖచ్చితమైన నిర్దారణ చేసేందుకు వీలుంటుంది. దీని ద్వారా కేవలం 8 గంటల సమయంలో 200 కి పైగా ఇమేజెస్ తీయవచ్చు. తద్ద్వారా తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ మందికి సేవలు అందించేందుకు వీలవుతుంది. దీని ద్వారా రోగులు అతి తక్కువ రేడియేషన్ కి గురి అవుతారు. ఈ విధానం వల్ల మనం పర్యావరణానికి కూడా మేలు చేసినవాళ్ళమవుతాము” అని అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected