Connect with us

Athletes

ఘనంగా రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ‘CATS’ వాలీబాల్ & త్రోబాల్ టోర్నమెంట్స్

Published

on

రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CAPITOL AREA TELUGU SOCIETY – CATS) ఆద్వర్యంలో వాషింగ్టన్.డి.సి మెట్రో ప్రాంతం లోని Cassel’s Sports Complex నందు వాలీబాల్ మరియు త్రోబాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఫిబ్రవరి 11 2023 శనివారం రొజున పురుషులకు వాలీబాల్ మరియు మహిళలకు త్రోబాల్ పోటీలు ఘనంగా నిర్వహించారు.

వాలీబాల్ మరియు త్రోబాల్ పోటీలకు వర్జీనియా, మేరిలాండ్, వాషింగ్టన్ డి.సి నుంచే కాకుండా నార్త్ కారొలిన, న్యూజెర్శి, పెన్సిల్వేనియా, టెన్నెస్సీ తదితర రాష్త్రాలనుండి 400 మందికి పైగా క్రీడాకారులు 20 వాలీబాల్ జట్లు మరియు 9 త్రోబాల్ జట్లు ద్వారా ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ పోటీల్లో డివిజన్-1, డివిజన్-2 ల వారిగా విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించడము జరిగినది. CATS ఆధ్వర్యంలో అవార్డు ప్రదానోత్సవం అట్టహసంగా జరిగినది. వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులు మరియు కార్య నిర్వాహక కమిటీ సభ్యులు విజేతలకు ట్రోఫీలు, పతకాలు, మరియు నగదు బహుమతులు అందించడము జరిగినది. నిర్వాహకులు వివిద రాష్త్రాల నుండి వచ్చిన క్రీడాకారులకు వారి సమయము మరియు క్రీడాస్పూర్తికి ధన్యవాదాలు తెలుపుతూ బవిష్యత్తులో నిర్వహింపు కర్యక్రమాలలొ పాల్గొనవలెనని కోరారు.

CATS అధ్యక్షులు సతీష్ వడ్ది మాట్లాడుతూ ఇంత అద్భుతమైన స్పోర్ట్స్ ఈవెంట్ విజయవంతంగా నిర్వహించినందుకు క్యాట్స్ టీమ్‌కు, వాలంటీర్ర్లు మరియు స్పొన్సొర్లు అందరికి ధన్యవాదాలు తెలియ జేశారు. CATS DMV ప్రాంతంలో వాలీబాల్ ,త్రో-బాల్ మరియు ఇతర క్రిడా టోర్నమెంట్లకు ఎల్లప్పుడు ఉన్నత ప్రమాణాలను నెలకొల్పింది మరియు ఇలాగె కొనసాగిస్థుంది అని కొనియాడారు.

విజయవంతమైన ఈ ఈవెంట్‌కి క్రుషిచెసిన స్పోర్ట్స్ టీమ్‌ సభ్యులైన విష్ణు ఎమ్మడి, అరుణ భసటి, ఫ్రద్యుమ్న (బాబీ), మధు బాబు, రఘు జువ్వాడి మరియు ఎగ్జిక్యూటివ్ టీమ్ పార్థ బైరెడ్డి, రమణ మద్దికుంట, కౌశిక్ సామ, విజయ డొండెటి , రామ యారుబండి, రవి గణపురం,హరీష్ కొండమడుగు, అమర్ పాశ్య, పవన్ పెండ్యల, రంగా సూర, కృష్ణ కిషొరె గాయం, సాయి ప్యెడీమర్ల, మహేష్ ఆనంథొజ్ మరియు నవ్య ఆలపాటి, తిప్పారెడ్డి కోట్ల కు ధన్యవాదాలు తెలియజేశారు.

అలాగే ఫౌండర్ రామ్ మోహన్ కొండ మరియు ట్రస్టీలు, సలహాదారులు మధు కోల, భాస్కర్ బొమ్మారెడ్డి, రవి బొజ్జ, ప్రవీన్ కటంగురి, సుధ కొండపు, శ్రీధర్ బాణాల, గోపాల్ నున్న, వెంకట్ కొండపోలు, రమేష్ రెడ్డి మరియు రాజ్ రెడ్డి రేకుల కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విజేతలు, క్రీడకారులు CATS నాయకత్వానికి, క్రీడా సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పాల్గొని, మెరుగైన ఆటను ప్రదర్శిస్తామని తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected