Connect with us

Jokes

భార్యను కంట్రోల్లో పెట్టే భర్తలు ఎంత మంది?

Published

on

భార్యను కంట్రోల్లో పెట్టే భర్తలు ఎంతమంది? ఒకరు ? ఇద్దరు? అందరూ? మనలాగే ఒక సారి ఇంద్రుడు కూడా స్వర్గలోకంలో భార్యను కంట్రోల్లో పెట్టే భర్తలు ఎంతమంది ఉన్నారో కనుక్కుందామని అక్కడ ఉన్న భార్యాభర్తలందరిని పిలచి ఒక సమావేశం ఏర్పాటు చేసారంట. ఇంద్రుడు కూడా ఒక మగ మహారాజే కదా, ఆ మాత్రం కుతూహలం లేకుండా ఉంటుందా!

భర్తలందరూ రెండు లైన్ లలో నించోండి అని అన్నారట ఇంద్రుడు. ఒకటో లైన్లో భార్య కంట్రోల్లో ఉండేవారు. రెండో లైన్లో భార్యను కంట్రోల్లో పెట్టేవారు. అందరూ ఒకటో లైన్ లోకి వెళ్ళి నుంచున్నారట. ఒకతను మాత్రం రెండో లైన్లో నుంచున్నాడట. ఇంద్రుడు ఆశ్చర్యంగా ఆ ఒక్కతని వైపు చూస్తూ నువ్వు ఒక్కడివన్నమాట భార్యను కంట్రోల్లో పెట్టేది అని అన్నారట. దానికి ఆ ఒక్క భర్త ఊరుకోండి సార్! మా ఆవిడే చెప్పింది నన్ను ఇక్కడ నుంచోమని అని సెలవిచ్చాడట.

కాబట్టి భార్యను కంట్రోల్లో పెట్టే భర్తలు ఎంతమంది? పెద్ద బండి సున్నా!!

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected