Connect with us

Literary

సంగీత సాహిత్య సంలంకృతే; మధురమైన ఆటా ఉగాది సాహిత్య సదస్సు

Published

on

అమెరికా తెలుగులు సంఘం (ఆటా) శనివారం ఏప్రిల్ 1, 2023 న ‘సంగీత సాహిత్య సంలంకృతే’ శీర్షికతో ‘ఆటా ఉగాది సాహిత్య సదస్సు’ కార్యక్రమం అధ్యక్షురాలు శ్రీమతి మధు బొమ్మినేని (Madhu Bommineni) మరియు కార్యవర్గ బృందం ఆధ్వర్యంలో వర్చువల్ పద్దతిలో జూమ్ వేదికగా ఘనంగా నిర్వహించారు.

ప్రపంచ వ్యాప్తంగా వీక్షకులు మరియు అతిధులు పాల్గోన్న ఈ కార్యక్రమాన్ని సాహిత్య వేదిక కమిటి అధిపతి శ్రీమతి శారద సింగిరెడ్డి మరియు సహ బృందం రవి తూపురాని, శ్రీమతి మాధవి భాష్యం, వీరన్న పంజాల విజయవంతగా నిర్వహించారు. ఆటా అధ్యక్షురాలు శ్రీమతి మధు బొమ్మినేని గారు శోభకృత్ నామ సంవత్సర మరియు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేశారు.

ఆటా సంస్థ సాహిత్యానికి, సంగీతానికి, భాషకి మూడు దశాబ్దాలకి పైగా పెద్ద పీఠ వేస్తూ ఎన్నో కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి సంసిద్దమవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కురువాడ సిస్టర్స్ హిమజ మరియు మానస గణేశ ప్రార్థనతో మొదలయిన కార్యక్రమంలో, శ్రీ శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ‘పంచాంగ శ్రవణం’ ప్రత్యేక ఆకర్షణ.

ఈ పంచాంగ శ్రవణంలో భాగంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు వాటి ఆదాయ వ్యయాలను, గ్రహగతులను, అలాగే అనుకూలతలకొరకు సలహాలు సూచనలను వారు వివరించడం జరిగింది. షడ్రుచుల సమ్మేళనంగా సాగిన శ్రీమతి మధవి భాష్యం గారి ఉగాది కవిత మరో ఆకర్షణగా నిలిచింది.

ప్రముఖ సాహితివేత్త, సీనియర్ పాత్రికేయులు శ్రీ పామిడికాల్వ మధుసూదన్ మరియు ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు మరియు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుల శ్రీ రామాచారి కొమండూరి స్వయంగా వివిద దేశాలనుండి వారి శిష్య బృందం పాల్గొన్న ఈ కర్యక్రమంలో ఏన్నో సాహితి విలువలతో కూడిన మధురమైన, జానపద సినీగీతాలను ఆలపించారు.

ఈ గీతాలకు శ్రీ పామిడికాల్వ మధుసూదన్ గారి సాహితీ వివరణ, వ్యాఖ్యానాలు ప్రత్యేక ఆకర్షణగా సాగిన ఈ కార్యక్రమం దాదాపు రెండు గంటలు నిర్విరామంగా సాగింది. సాహిత్య వేదిక కమిటీ ఉపాధిపతి రవి తూపురాని కార్యక్రమానికి తోడ్పడిన వారందరికి వందన సమర్పణ చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected