Cumming, Georgia: అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా నగరానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు, సినీనటులు, తెలుగు సమాజ అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న వెంకట్ దుగ్గిరెడ్డి ప్రతిష్ఠాత్మక “పూర్ణ నంది తెలుగు తేజం” అవార్డు డెబ్యూ ప్రొడ్యూసర్ విభాగంలో గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
తెలంగాణ కల్చరల్ అండ్ లివింగ్ ఆర్ట్స్ అండ్ మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవార్డు ప్రదానోత్సవం అత్యంత వైభవంగా, సాంస్కృతిక కళా వైభవాన్ని ప్రతిబింబిస్తూ గత మార్చి నెలలో హైదరాబాద్ (Hyderabad, Telangana) లక్డీకపూల్‌లోని హోటల్ హాంప్షైర్ ప్లాజాలో లో నిర్వహించారు.
ఈ సందర్భంగా జార్జియా రాష్ట్రంలోని కమింగ్ (Cumming, Georgia) నగరంలో ఉన్న సెలబ్రేషన్స్ ఈవెంట్ హాల్ (Celebrations Banquet Hall) లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. అట్లాంటా తెలుగు సమాజానికి చెందిన ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, కళాకారులు మరియు సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జార్జియా స్టేట్ రిప్రజెంటేటివ్ టాడ్ జోన్స్ (Todd Jones), ప్రముఖ ఆటిజం నిపుణుడు డాక్టర్ ఏ.ఎం. రెడ్డి, జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ సభ్యుడు దిలీప్ తుంకి, ఇంటర్‌సెక్ట్ గ్రూప్స్ సీఈఓ డేవిడ్ బాబా, హాలీవుడ్ (Hollywood) చిత్రం బ్లాక్ పాంథర్ తో అనుబంధం కలిగిన టోనీ ఎఫ్. చార్లెస్, విస్సెన్ టెక్ సీఈఓ ఉపేంద్ర రాచుపల్లి, రాపిడ్ ఐటీ సీఈఓ గౌతమ్ గోలి తదితర ప్రముఖులు హాజరయ్యారు.
కార్యక్రమంలో వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) సేవలను కొనియాడుతూ పలువురు వక్తలు ప్రసంగించారు. అటు సినిమాలతో ఇటు సామాజిక సేవా కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న వ్యక్తిగా ఆయనను ప్రశంసించారు.
అనంతరం వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ గౌరవాన్ని తన కుటుంబ సభ్యులు, మిత్రులు, సహచరులు మరియు తన ప్రయాణంలో తోడ్పడిన ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తనకు జన్మనిచ్చిన తల్లితండ్రులను, తోడుగా నిలుస్తున్న శ్రీమతిని తలచుకున్నారు.
తనపై చూపిన ప్రేమాభిమానాలకు, విశ్వాసానికి నిర్వాహకులకు మరియు అట్లాంటా (Atlanta, Georgia) తెలుగు సమాజానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని అభినందనలు తెలియజేయడంతో కార్యక్రమం మరింత ఆత్మీయంగా మారింది.
సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, సత్కార కార్యక్రమాలతో ఈ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. తెలుగు సినీ (Telugu Movies) రంగానికి మరియు సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులను గుర్తించి సత్కరించడం ద్వారా సమాజంలో స్ఫూర్తిని నింపాలనే లక్ష్యంతో ఈ అవార్డు అభినందన కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
సమాజ సేవ, నాయకత్వ లక్షణాలు మరియు సాంస్కృతిక అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా శ్రీ వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) గారికి ఈ పురస్కారం లభించడం అట్లాంటా (Atlanta, Georgia) తెలుగు సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు.
2026 కి గాను పూర్ణ నంది తెలుగు తేజం అవార్డు (Awards) అందుకున్న వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) కి హృదయపూర్వక అభినందనలు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తెలుగు సినీ (Movies) రంగానికి మరియు సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని పలువురు తెలిపారు.