Connect with us

Government

Andhra Pradesh, Telangana: ఎమ్మెల్యే సీట్ల పెంపు ఎప్పుడంటే

Published

on

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగినప్పటి నుంచి ఎమ్మెల్యే సీట్లు పెంచాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రాన్ని అడుగుతున్న విషయం తెలిసిందే. విభజన చట్టానికి సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ లో సీట్ల సంఖ్యను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలనేది ప్రతిపాదన.

దీనికి సంబంధించి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌ ఈవిధంగా సమాధానం ఇచ్చారు. అదేంటంటే 2026 జనగణన తర్వాత రాజ్యాంగంలోని 170వ అధికరణ ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యే సీట్ల సంఖ్యలో మార్పులు జరుగుతాయని, వాటితోపాటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఎమ్మెల్యే సీట్ల పెంపు ఉంటుందని తేల్చారు. మొత్తానికి ఇంకో 5 సంవత్సరాలు ఆగితేగాని మన రాజకీయనాయకుల కోరిక నెరవేరదన్నమాట.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected