Connect with us

News

కృష్ణా జలాలపై పునః సమీక్ష ఆంధ్రప్రదేశ్ కు శరాఘాతం; ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు

Published

on

కేంద్ర ప్రభుత్వం కొత్తగా కృష్ణా జలాల పై పునః సమీక్ష చేసి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులను తిరిగి పరిశీలించి, రెండు రాష్ట్రాల జల వివాదాలను విని మళ్ళీ కొత్తగా కేటాయింపులు కు వీలు కల్పించేలా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అధికారాలు కట్టబెడుతూ కేంద్ర మంత్రిమండలిలో తీర్మానం చేసిన నేపథ్యంలో దీనివలన ఆంధ్ర ప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయంపై విజయవాడలోని రాష్ట్ర సమాఖ్య కార్యాలయం నుండి సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పూర్తి వివరాలతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ.. కృష్ణానదిపై జలాల పంపిణీకి మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎంతో అధ్యయనం చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలతో చర్చించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు అయిందని దీని తుది తీర్పు అమలు, అన్యాయం పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో రిట్ పీటిషన్ వేయగా కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ తీర్పు అమలుపై ఇంకా గజిట్ విడుదల చేయాలని,కృష్ణ జలాలపై గతంలో బచావత్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫోర్సులోనే ఉందని, దీని తుది తీర్పునకు లోబడి రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణానది యాజమాన్య బోర్డు (కే.ఆర్.ఎం.బి) దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టిఎంసి లలో ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకునే తాత్కాలిక ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ జరుగుతుందని అన్నారు.

ఇప్పటికే కృష్ణానదికి ఎగుబాగాన ఉన్న తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎగువ బాగాన చట్ట విరుద్ధంగా సి.డబ్ల్యూ సి., కే ఆర్ ఎం బి, ఏపెక్స్ కౌన్సిల్ నుండి ఏ విధమైన అనుమతులు లేకుండా 105 టిఎంసిల తో ఎస్.అర్. బీ.సీ, కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులు విస్తరణ, 150 టిఎంసిలతో పాలమూరు – రంగారెడ్డి, దిండి, భక్త రామదాసు, తుమ్మెళ్ళ, మిషన్ భగీరథ తదితర కొత్త ప్రాజెక్టులు కలిపి మొత్తం 255 టీఎంసీలతో ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తుందని, కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఈ అక్రమ ప్రాజెక్టులను సక్రమ ప్రాజెక్టులుగా మార్చుకుని నీటి కేటాయింపులు అక్రమం గా తెలంగాణా చేసుకునే ప్రమాదం ఉందని దీనివలన శ్రీశైలం ఎక్కువ భాగాన నికర కేటాయింపులు ఉన్న నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల కింద ఉన్న 15 లక్షల ఎకరాలు, కృష్ణ డెల్టా పరిధిలో ఉన్న 13 లక్షల ఎకరాలు, ఎస్.అర్. బి.సి కింద ఉన్న రెండు లక్షల ఎకరాలు మొత్తం 30 లక్షల ఎకరాల కు చుక్క నీరు రాకుండా బీడు భారే ప్రమాదం ఉందని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి హక్కులకు భంగం కలిగించే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీకి కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే వ్యతిరేకించి, ఆ నిర్ణయాన్ని అమలుకాకుండా చూసి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఆంధ్ర ప్రదేశ్ నీటి హక్కులు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కృష్ణానదిపై దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కి అన్ని హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఆమోదించే ప్రసక్తి లేదని దీనిమీద కృష్ణా పరివాహ ప్రాంతా రైతులతో కార్యచరణ రూపొందించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected