ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తానా చైతన్య స్రవంతి వేడుకల్లో భాగంగా ఒక అద్భుతమైన సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. డాక్టర్ కోమండూరి రామాచారి గారి లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ (Little Musicians Academy – LMA) నుండి 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఒకే వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వబోతున్నారు.
వేదిక: శిల్పకళా వేదిక, హైదరాబాద్
తేదీ: డిసెంబర్ 29, 2026
తానా (TANA) సంబరాల్లో పాలుపంచుకుంటూ, భావి తరాల గాయనీ గాయకుల ఈ మధుర గానాన్ని తప్పక వీక్షించవలసిందిగా తానా నాయకులు కోరారు.