Connect with us

Sports

TANA @ Philadelphia: Elite Brains Chess Coaching – చదరంగంలో మెళకువలు నేర్పుతూ తానా మిడ్ అట్లాంటిక్ శిక్షణా కార్యక్రమం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం మిడ్ అట్లాంటిక్ విభాగం (TANA Mid-Atlantic Chapter) ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. క్రీడాకార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ వివిధ పోటీలను ఇతర కార్యక్రమాలను తానా మిడ్ అట్లాంటిక్ (Philadelphia) ఏర్పాటు చేస్తోంది.

తాజాగా ఎలైట్ బ్రెయిన్స్ చెస్ కోచింగ్ ప్రోగ్రామ్ (Elite Brains Chess Coaching) ను ప్రారంభించింది. 4 వారాలపాటు జరిగే ఈ శిక్షణ కోర్సును సెప్టెంబర్ 26న ప్రారంభించారు. అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది. ప్రతి శనివారం ఉదయం 10 నుంచి 11 వరకు ఈ శిక్షణ ఉంటుంది.

అద్భుతమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతోపాటు, కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న వ్యోమ్ క్రోత్తపల్లిని తానా నాయకులు అభినందించారు. కరికులం (Curriculum) రూపకల్పనలో మరియు కోఆర్డినేషన్‌లో రోహన్ గుండూరు కీలకపాత్ర పోషిస్తున్నారు.

బిగినర్ లెవెల్ కోచింగ్‌కు మద్దతు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రణవ్ కంతేటిని తానా (Telugu Association of North America – TANA) నాయకులు అభినందించారు. అలాగే ఈ శిక్షణ కార్యక్రమానికి మెంటార్ గా వ్యవహరిస్తున్న జోషువా ఆండర్సన్‌కు (Joshua Anderson) కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ శిక్షణ తరగతుల ప్రారంభానికి ముందు ప్రోత్సాహకరమైన సందేశాన్నిందించి, విద్యార్థులందరిలో ఉత్సాహాన్ని నింపిన తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri), ఈ కార్యక్రమంలో భాగస్వాములై, సెషన్‌కు తమ మద్దతు తెలిపిన తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి (Phani Kantheti), రంజిత్ మామిడి, మరియు ప్రసాద్ క్రొత్తపల్లిని తానా (TANA) ఉన్నత నాయకత్వం అభినందించింది.

error: NRI2NRI.COM copyright content is protected