Frankfurt, Germany, September 22, 2026: తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (TAG) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు సంబరం 2026’ కార్యక్రమం జర్మనీలోని తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ఘనంగా చాటిచెప్పింది. జర్మనీ నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగు కుటుంబాలు, సాంస్కృతిక ప్రతినిధులు, విద్యార్థులు, ప్రముఖులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) మాట్లాడుతూ, నేను అనివార్య కారణాల వలన మిమ్మల్ని ప్రత్యేక్షంగా కలుసుకోలేక ఇలా పరోక్షంగా జూమ్ ద్వారా ప్రసంగించటం కొంచెం బాధ కలిగించిన, మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది అని చెప్పారు. “మనం ఎక్కడున్నా మన మూలాలను మరవకూడదు. తండ్రి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం, గురువు—ఈ ఐదింటినీ జీవితంలో ఎప్పుడూ విస్మరించరాదు” అని అన్నారు.
జర్మనీ (Germany) వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నివసిస్తూ, ఆధునిక రంగాల్లో రాణిస్తూనే తెలుగు ప్రజలు తమ ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు, మాతృభాషను గుండెల్లో దాచుకొని కాపాడుకుంటున్న తీరు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. జర్మనీ నలుమూలల నుంచి తెలుగు వారిని ఒక తాటిపైకి తెచ్చి, వారి సాంస్కృతిక అస్తిత్వాన్ని పరిరక్షించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
కర్ణాటక సంగీత తరగతులు, తెలుగు–జర్మన్ పుస్తకాల ప్రచురణ, భాషా బోధన, సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Performances) వంటి కార్యక్రమాలు భావితరాలకు తెలుగు వారసత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు. సంస్కృతి పరిరక్షణ కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, ప్రతి కుటుంబం మరియు ప్రతి వ్యక్తి నిరంతరం నిర్వర్తించాల్సిన బాధ్యతగా మారాలని ఆయన సూచించారు.
“ఇంట్లో పిల్లలతో తప్పనిసరిగా అమ్మభాషలోనే మాట్లాడాలి. ఎన్ని భాషలు నేర్చుకున్నా, మన ఆలోచనలకు ప్రాణం పోసేది మాతృభాష (Mother Tongue) మాత్రమే” అని ఆయన ఉద్ఘాటించారు. జర్మనీలో పెరుగుతున్న తెలుగు పిల్లలు భవిష్యత్తులో గ్లోబల్ సిటిజన్లుగా ఎదిగినా, వారి మూలాలు తెలుగు నేలతో, భారతీయ సంస్కృతితో దృఢంగా అనుసంధానమై ఉండాలని ఆకాంక్షించారు.
నేడు ప్రపంచం భారతదేశం (India) వైపు ఆసక్తితో, గౌరవంతో చూస్తోందని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు. డిజిటల్ విప్లవం, అంతరిక్ష సాంకేతికత, పునరుత్పాదక శక్తి, స్టార్టప్ వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధిస్తున్న విజయాలు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాయని పేర్కొన్నారు. ‘వసుధైవ కుటుంబకం’ అనే సనాతన భారతీయ భావనను ప్రపంచానికి చాటిచెబుతూ, గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ బలమైన మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.
భారతదేశం (India) అభివృద్ధి చెందిన దేశంగా మారే సంకల్పంతో ముందుకు సాగుతోందని, ఈ మహా యజ్ఞంలో ప్రవాస భారతీయుల పాత్ర అత్యంత కీలకమని శ్రీ వెంకయ్య నాయుడు (Muppavarapu Venkaiah Naidu) తెలిపారు. భారతదేశంలోని నవతరం ఈ సంకల్పాన్ని మరింత బలపరుస్తూ, దేశాన్ని ప్రపంచ గురువుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.
‘తెలుగు సంబరం 2026’లో తెలుగు భాషా సాహిత్యం, సంగీతం, నృత్యం, జానపద కళలు, సంప్రదాయ వేషధారణ, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమం తెలుగు ప్రజల ఐక్యతను, సాంస్కృతిక చైతన్యాన్ని, భావితరాల పట్ల వారి బాధ్యతను ప్రతిబింబించింది.
ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ జనరల్ (India Consul General) సుచిత కిషోర్, శాసనమండలి మాజీ సభ్యులు TD జనార్దన్ (T.D. Janardhan), ప్రముఖ సినీ నటులు నిఖిల్ సిదార్థ (Nikhil Siddhartha), నెక్కంటి నిషాంత్ తదితరులు ప్రసంగించారు. సుచిత కిశోరె మాట్లాడుతూ, ఇప్పటి దాక చాల తెలుగు సంఘాలు ఒకో రాష్ట్రానికి, సిటీ కి పరిమితమై ఉన్నాయ్, TAG మాత్రం జర్మనీ లో ఉన్న అందరినీ ఒక తాటి మీదకి తీసుకు రావటం అభినందనీయం అని చెప్పారు.
TD జనార్దన్ (T.D. Janardhan) గారు మాట్లాడుతూ, జర్మనీ భాష కి మన సంస్కృతానికి చాల సారూప్యత ఉంది, అలాగే రాష్ట్రాన్ని కూడా మర్చిపోకుండా మీరు ఇన్వెస్ట్మెంట్లు తీసుకు రావాలి అని పిలుపు ఇచ్చారు. జర్నలిస్ట్ నిషాంత్ మాట్లాడుతూ జర్మనీ మొత్తం రొండోవా ప్రపంచ యుద్ధం (World War II) లో మొత్తం కూలిపోయి మల్ల ఇంత అభివృద్ధి చెందటం మన అందరకి స్ఫూర్తిదాయకం అలాగే మీరు అంత పిల్లలకి ఇంట్లో తెలుగు మాట్లాడు, తెలుగు కల్చర్ నేర్పించి మన తెలుగు రాష్ట్రాల్ల అనుబంధం ఏర్పడేలా చేయాలి అని చెప్పారు.
నిఖిల్ (Actor Nikhil Siddhartha) అందరితో కలిసి పోయి పిల్లల్ని, యువత ని ఐన డాన్సులతో, మాటలతో హుషారు ఎతించారు, అంతే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇచ్చి సంతోష్ పరిచారు. మంగ్లి (Singer Mangli) తన సంగీత బృందం తో జరిపిన పాటల ప్రోగ్రాం అందర్నీ అలరించింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేశారు.
ఈ కార్యకరమలో కృష్ణ జవ్వాజి, రామ్ బొల్లా, మోహన్ జొన్నలగడ్డకి వివిధ రంగాల్లో సేవలు అందించినందుకు విశిష్ట పురస్కారాలు అందచేశారు. ఈ కార్యక్రమలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (Telugu Association of Germany – TAG) కార్యవర్గ సభ్యలు నరేష్ కోనేరు, సుమంత్ కోర్రపాటి, శ్రీకాంత్ కుడితిపూడి, శివ బత్తల, వంశీ దాసరి, వెంకట్ ఖండ్ర, దినేష్ కోవి, ఫర్హత్ మీర్జా, వంశీ ఉండవల్లి తదితరాలు పాల్గొన్నారు.