Connect with us

Devotional

London, England: ఏ దేశమేగినా తెలుగు తల్లిని, వినాయక చవితిని మరువం – లండన్ ఉత్సవ్ సమితి

Published

on

  • లండన్ (London) లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
  • భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా అట్టహాసంగా నిర్వహణ
  • పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగు వారు

London, England: లండన్ లో వినాయక చవితి వేడుకలను తెలుగువారు ఘనంగా నిర్వహించారు. లండన్‌లోని సటన్, క్రోయ్‌డాన్ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు లండన్ ఉత్సవ్ సమితి (London Ganesh Utsava Samithi) ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

భారతీయ సంస్కృతి, తెలుగు సంప్రదాయం, హిందూ (Hindu) ధర్మం ఔన్నత్యాన్ని చాటేలా లండన్‌లోని సుట్టన్ (Sutton, London) ప్రాంతంలో గణేష్ ఉత్సవం అట్టహాసంగా జరిగింది. గ్రేటర్ లండన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగువారు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పూజల్లో పాల్గొన్నారు.

విగ్రహం పెట్టడం మొదలు.. నిమజ్జనం వరకు శాస్త్రోక్తంగా..

ఈ సందర్భంగా వినాయక (Lord Ganesh) విగ్రహాన్ని పెట్టి వ్రత కల్పం ప్రకారం పూజలు నిర్వహించారు. స్థానికులు దంపతులుగా పీటల మీద కూర్చుని పూలు, పత్రి సమర్పించారు. ఏ దేశమేగినా… తెలుగు తల్లిని.. వినాయక చవితిని మర్చిపోమని మరోసారి నిరూపించారు.

స్థానిక పూజారి పూజల్ని చేయించారు. అనంతరం విగ్రహాన్ని బాజా భజంత్రీలు…. డప్పు వాద్యాల నడుమ నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు వీక్షకులను ఆకట్టుకుంది. పిల్లా పెద్ద ఊరేగింపులో ఉత్సాహంగా డాన్సులు వేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) ఆకట్టుకున్నాయి.

ఆనందోత్సాహాల మధ్య చేసుకున్నాం..

లండన్ ఉత్సవ కమిటీ (London Ganesh Utsava Samithi) ఆధ్వర్యంలో గణపతికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసినట్టు కమిటీ సభ్యులు భాస్కర్ రావు అమ్మినేని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక భాగస్వామ్యంతో వేడుకలు ఎంతో ఉత్సాహభరితంగా జరిగాయన్నారు.

సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ చెరుకూరి, వెంకట్ కంఠేటి, మురళీ మైనేని, లండన్ ఉత్సవ కమిటీ (London Ganesh Utsava Samithi) నిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected