Connect with us

Kids

ఖండాతరాలు దాటిన తెలుగు వేదిక: తానా పాఠశాల తరగతులు ప్రారంభం @ USA

Published

on

TANA @ USA: ఏ దేశమేగినా, ఎందు కాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అన్న నానుడిని నిజం చేస్తూ, భాషే బంధానికి పునాదిగా మాతృభూమి, మాతృబాష మూలాలను సజీవంగా నిలుపుకుంటూ, వృత్తి ఉపాధి రీత్యా ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాల చిన్నారులకు తెలుగు నేర్పించే సమున్నత వేదిక తానా (TANA) పాఠశాల.

2026 – 27 సంవత్సరానికి విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించామని పాఠశాల అధ్యక్షులు భానుప్రకాష్ మాగులూరి (Bhanu Maguluri) తెలిపారు. పలు ప్రశ్నలకు బదులిస్తూ సూచన, సలహాలను స్వీకరిస్తూ కార్యక్రమం ఆద్యంతం గొప్పగా జరిగింది. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు నరేన్ కొడాలి (Naren Kodali), కోశాధికారి రాజా కసుకుర్తి (Raja Kasukurthi) కూడా పాల్గొని విద్యార్థులకు తమ సందేశాన్ని అందించారు.

ప్రధమంగా ఐదేళ్ల పైబడిన చిన్నారులకు పలుకు, అడుగు, పరుగు, వెలుగు విభాగాలలో సరళంగా తెలుగు భాషను నేర్పిస్తూ, వారికి భాషపై మక్కువ కల్పిస్తూ, సులభపద్ధతిలో బొమ్మలతో కూడిన పాఠాలను బోధిస్తూ, అంతిమంగా తమ అమ్మ, నాయనమ్మ, తాతలతో తెలుగులో (Telugu) స్పష్టంగా రాస్తూ, చదువుతూ, సంభాషించే స్థాయికి చేర్చటమే పాఠశాల ఆశయం, లక్ష్యం.

ఈ వారం అమెరికాలో (USA) పలు పట్టణాలలో తరగతులు ఆరంభించారు. చిన్నారుల సృజనాత్మకతను పెంచుతూ, సరళ పద్దతిలో భాషను అనుసంధానిస్తూ స్వచ్ఛందంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయుల (Teachers) నిరంతర ప్రయత్నం అసామాన్యం. వారికి సర్వదా అభినందనలు.

మనకు తెలిసిన వంద మందికి పాఠశాల (TANA Paatasala) వేదికను పరిచయం చేస్తూ ప్రత్యక్ష, ఆన్ లైన్ తరగతుల్లో నేర్చుకునే విధంగా ప్రోత్సహించటం మనందరి కర్తవ్యం. భాషే బంధానికి మూలం. తెలుగును పరిరక్షించుకుంటూ మరో తరానికి అందిద్దాం. భాషకు (Telugu Language) వారసులుగా చరిత్రలో మనవంతు భాద్యతను నిర్వర్తిద్దాం.

error: NRI2NRI.COM copyright content is protected