Atlanta, Georgia, USA, August 15, 2026: డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘పాంచాలి పంచభర్తృక’ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరామ్ ఆర్ట్స్ బ్యానర్లపై వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్, శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మన్యం నిర్మించిన ఈ చిత్రం వినోదం, కామెడీ, సస్పెన్స్ అంశాల మేళవింపుతో రూపొందింది.
ఈ సినిమాలో డా. రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ పృథ్వీ, రోల్ రైడా, జెమిని సురేష్, శ్రీకాంత్ అయ్యంగార్ (Actor Srikanth Iyengar), సరీహ్ ఫార్, అలాగే అట్లాంటా (Atlanta, Georgia) నుంచి వెంకట్ దుగ్గిరెడ్డి మరియు పవన్ పూసర్ల కీలక పాత్రల్లో నటించారు. 50 మందికి పైగా నటీనటులు వివిధ పాత్రల్లో కనిపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) ఇప్పటికే దాదాపు 12 సినిమాలలో నటించి విజయపథంలో నడుస్తుండగా పవన్ పూసర్ల (Pavan Pusarla) టాలీవుడ్ లో మొట్టమొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరిస్తున్నారు. బంతిపువ్వు బాబ్జి, పిడుగు పుష్పరాజ్, బేబీ స్టార్ బాబ్జి వంటి ఫన్నీ పేర్లతో థియేటర్స్ ని నవ్వులతో నింపేశారు. లెస్ లాజిక్ మోర్ మ్యాజిక్ అంటూ నవ్వులు పంచేలా ఈ సినిమా సరదాగా సాగుతుంది.
కథ విషయానికి వస్తే.. నలుగురు వ్యక్తులు అనుకోకుండా ఓ విదేశీ యువతి మరణం చుట్టూ చిక్కుల్లో పడటం, ఆ యువతికి అండర్‌వరల్డ్ డాన్‌తో సంబంధం ఉండటం, ఆ సమస్య నుంచి బయటపడేందుకు వారు చేసే ప్రయత్నాలు సినిమాను (Panchali Pancha Bharthruka) ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తాయి. కామెడీతో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను కలగలిపి కథనాన్ని రూపొందించారు.
ముఖ్యంగా డా. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), పృథ్వీ (Prudhvi Raj) తమదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారని, జెమిని సురేష్ (Gemini Suresh), రోల్ రీడా (Roll Rida) తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారని సమీక్షలు పేర్కొంటున్నాయి. వెంకట్ దుగ్గిరెడ్డి అటు నెల్లూరు మాడ్యులేషన్ ఇటు కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇచ్చేలా దర్శకుడు గంగా సప్తశిఖర (Gangadhar Sapthasikhara) కథను తీర్చిదిద్దినట్లు ప్రశంసలు వచ్చాయి.
మహేష్ నారాయణ సంగీతం అందించిన ఈ చిత్రానికి జానీ బాషా నాగ ఎడిటర్‌గా, కేవీ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ‘పాంచాలి పంచభర్తృక’ కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని కామెడీ, సస్పెన్స్, థ్రిల్‌ను అందించే వినోదాత్మక చిత్రంగా (Comedy Movie) నిలిచింది. ముఖ్యంగా డాన్ ఎవరనేది చివరి వరకు సీక్రెట్టే. అట్లాంటా జానపద జనార్దన్ (Janardhan Pannela) ఈ సినిమాకి టైటిల్ సాంగ్ పాడడం విశేషం.
ఈ మధ్య సోషల్ మీడియాలో (Social Media) పాపులర్ అయిన కొంతమందిని ఈ సినిమాలో చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ముఖ్యంగా అమెరికాలో (USA) 17 రాష్ట్రాలలో 30 థియేటర్స్‌లో కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. చిత్ర బృందం కూడా ప్రేక్షకుల ఆదరణపై ఆనందం వ్యక్తం చేస్తోంది.