Connect with us

News

నాట్స్ 9వ అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాలు షురూ, Dallas చాప్టర్ నూతన కార్యవర్గ ప్రకటన

Published

on

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) సమావేశం జూలై 12న అత్యంత విజయవంతంగా ముగిసింది. మూడు గంటలకు పైగా సాగిన ఈ సమావేశానికి నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డల్లాస్ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించడంతో పాటు, మే 2027లో ప్రతిష్టాత్మకంగా జరగబోయే 9వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల సన్నాహక కార్యక్రమాలపై విపులంగా చర్చించారు.

ఈ సమావేశంలో నాట్స్ మహాసభలకు కన్వీనర్ గా ప్రేమ్ కలిదిండి (Prem Kalidindi) ని, డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) కోఆర్డినేటర్లు గా కిరణ్ నారె మరియు పావని నున్న లని నియమించారు. అనుభవజ్ఞులు, యువత కలయికతో సమతూకంతో ఏర్పడిన ఈ నూతన డల్లాస్ చాప్టర్ జట్టుకి నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla) మరియు అధ్యక్షులు రాజ్ అల్లాడ (Raj Allada) ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ సమావేశంలో నాట్స్ (NATS) జాతీయ జట్టు నుండి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో కిషోర్ కంచర్ల, ప్రేమ్ కలిదిండి, అజయ్ గోవాడ, విజయ్ శేఖర్ అన్నె (Vijay Sekhar Anne), భాను లంక, కిషోర్ నారె (Kishore Nare), రత్నాకర్ శెట్టిపల్లి, శ్రావణ్ నిడిగంటి, ధనుంజయ నూతి తదితరులు ఉన్నారు. నూతనంగా ఎన్నికైన చాప్టర్ జట్టు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు.

ముఖ్యంగా కింది అంశాలపై దృష్టి సారించారు: నాట్స్ సంస్థలో మరియు సేవా కార్యక్రమాల్లో యువత, మహిళలకు మరింత భాగస్వామ్యం కల్పించడం. మే 2027లో డల్లాస్ (Dallas) వేదికగా అంగరంగ వైభవంగా జరగనున్న 9వ అమెరికా తెలుగు సంబరాల (Convention) నిర్వహణకు పక్కా ప్రణాళికలు రచించడం.

నాట్స్ (NATS) మహాసభలను విజయవంతం చేసేందుకు మరింత మంది వాలంటీర్లు ఉత్సాహంగా ముందుకు రావాలని చైర్మన్ కిషోర్ కంచర్ల, కన్వెన్షన్ కన్వీనర్ ప్రేమ్ కలిదిండి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలుగువారి ఐక్యతను చాటే ఈ వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని వారు కోరారు.

error: NRI2NRI.COM copyright content is protected