Virginia – తానా పాఠశాల (TANA Patasala) వేదికగా భాను ప్రకాష్ మాగులూరి సమన్వయంతో ప్రవాస తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. మాతృభూమి, మాతృబాష.. మన విధానం, నినాదం అంటూ ముందుగు సాగుదాం అని ముక్తకంఠంతో నినదించారు.
అనుభవాలు, ఆలోచనలు పంచుకున్న అతిధి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, BJP AP రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం (Paturi Nagabhushanam) మాట్లాడుతూ .. వృత్తి ఉపాధి రీత్యా అమెరికా కు వచ్చినా లక్షలాది మంది మాతృభాష తెలుగును మన పిల్లలకు నేర్పిద్దాం, మనదైన చరిత్ర, సంస్కృతీ కాపాడుకుంటూ మన పిల్లలను తీర్చిదిద్దుదాం అన్నారు.
అన్ని భాషలూ నేర్చుకుందాం.. కానీ మాతృభాషలో (Mother Tongue) సంభాషించుకుందాం అంటూ అందరినీ ప్రోత్సహించారు. తెలుగు భాషను పరిరక్షించుకోవటం కూడా మన ప్రధాన భాద్యత. మన పిల్లలు – మన పెద్దల తరాల వారధిగా.. సాంస్కృతిక సారధిగా మన మాతృబాష తెలుగును కాపాడుకుందాం అని అన్నారు.
భాను ప్రకాష్ మాగులూరి (Bhanu Maguluri) మాట్లాడుతూ తెలుగు మన ఆస్తి, అస్తిత్వం. మన తల్లి దండ్రులకు, మన బిడ్డలకు వారధి తెలుగే (Telugu Language). మన జీవితకాలం మాతృబాష సజీవం, సకలం, సమస్తం అని తెలిపారు. ఈ సందర్భంగా అందరూ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, BJP రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం ని శాలువాతో సత్కరించారు.