Connect with us

Politics

NRI TDP @ Bay Area, California: వైభవంగా మహానాడు & NTR జయంతి వేడుకలు

Published

on

బే ఏరియా (Bay Area, California) లో ఎన్నారై టీడీపి ఆధ్వర్యంలో మహానాడుతోపాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపి నాయకుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో మిల్పిటాస్ (Milpitas) లోని బిర్యానీ జంక్షన్ (Swagat Indian Cuisine)లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 100 మందికి పైగా టిడిపి అభిమానులు హాజరయ్యారు.

ఎన్టీఆర్‌కు (NTR) అందరూ నివాళులు అర్పిస్తూ, ఆయన చేసిన సేవలను, నటనను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా జయరాం కోమటి (Jayaram Komati) మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు తెలుగు దేశం పార్టీని (Telugu Desam Party) స్థాపించారని, ఆయన ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపి జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కొనసాగిస్తూ వస్తున్నారని చెప్పారు.

రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి పయనింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కూడా ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముఖ్యమంత్రి (Nara Chandrababu Naidu) మహానాడు ప్రారంభించిన టైములోనే ఇక్కడ కూడా ప్రారంభించడం సంతోషంగా ఉందని కూడా జయరాం కోమటి చెప్పారు.

మహానాడు రెండవరోజు కూడా మెయిన్ స్క్రీన్ పై జయరాం కోమటి (Jayaram Komati) ఎన్నారైల భాగస్వామ్యంపై మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తో కొన్ని సినిమాల్లో (Movies) నటించిన ప్రముఖ రంగస్థల నటుడు అక్కిరాజు సుందరరామకృష్ణ పాల్గొనడం హైలైట్‌గా నిలిచింది. ఆయన ఎన్టీఆర్ (NTR) తో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు. పౌరాణిక పద్యాలను పాడి అందరినీ ఆకట్టుకున్నారు.

78 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన గతంలో జమునతో కలిసి శ్రీకృష్ణరాయబారం నాటకాలను వివిధ చోట్ల వేశారు. ఎన్నారై టీడిపి (NRI TDP) నాయకుడు వెంకట్ కోగంటి (Venkat Koganti) ఈ వేడుకల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా చిన్నారులచేత కేక్ కట్ చేయించారు. తరువాత జూమ్ మీటింగ్ ద్వారా మెయిన్ మహానాడును (Mahanadu) వీక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి (Vijay Gummadi), వీరు ఉప్పల, విజయ్ సాగర్ రెడ్డి, సీతారాం కొడాలి, అంబటి సతీష్, వాసు బండ్ల, భాస్కర్ అన్నె, సురేంద్ర కారుమంచి, శ్రీనివాస్ వల్లూరిపల్లి, జగదీష్ గింజుపల్లి, తెలుగు టైమ్స్ ఎడిటర్ సి.వి. సుబ్బారావు, శివ దువ్వూరు, హరి బొప్పూడి, రమేష్ మల్లారపు, నరహరి మార్నేని, ధీరజ్ కావూరి, అశోక్ మైనేని, కోన నరేంద్రనాథ్ రెడ్డి, మోహన్ మల్లంపాటి, వెంకట్ పరిమి, హరి సన్నిధి పాల్గొన్నారు.

అలాగే రవికిరణ్ ఆలేటి, రాఘవయ్య, రాజశేఖర్ పర్వతనేని, చంద్రశేఖర్ తిరుమలపుత్ర, రాంబాబు మానుకొండ, మోహన్ శ్రీకాంత్ పచవ, కళ్యాణ్ వీరపనేని, వీరబాబు పత్తిపాటి, లోకేష్, ధీరజ్ కావూరి, మురళీ, కృష్ణ చెరుకుళ్ళ, మునిరెడ్డి, శివ అద్దంకి, నవీన్ కొడాలి, అనిల్ రెడ్డి దప్పిలి, సుధీర్ నెల్లూరు, శ్రీనివాస్ వెలగపూడి, సురేష్ బాబు రాగలపల్లి, మధుసూదన్ రెడ్డివారి, బిల్ల భగవాన్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు (Women) కూడా పాల్గొనడం విశేషం. సునీత రాయపనేని, శిరీష నెక్కలపూడి, విలేఖ్య వెనిగళ్ళ, శైలజ వెల్లంకి, ప్రభావతి కొప్పల్లి, మానస పరిమి, శ్రీదేవి శిరియాలు నెల్లూరి, దివ్య శ్రీ తదితర మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected