Anakapalli, Visakhapatnam: తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహాకులు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) మాట్లాడుతూ – “తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యవంలో రెండు సంవత్సరాల క్రితం సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో, సిరివెన్నెల సమగ్రసాహిత్యం మొత్తాన్ని 6 సంపుటాలలో ముద్రించి ఆవిష్కరించడం జరిగింది.
ఎక్కడైతే సిరివెన్నెల (Sirivennela Sitaramasastri) తన బాల్యాన్ని గడిపారో, విద్యాబుద్దులు నేర్చుకున్నారో, వివాహం చేసుకున్నారో, అదే గాంధీనగరం వీధిలో, అనకాపల్లి నగరంలో గత జనవరి 25 న సిరివెన్నెల నిలువెత్తు కాంస్యవిగ్రహాన్ని తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యవంలో ఆవిష్కరించడం జరిగింది. భారత రాష్ట్రపతి పురస్కార గ్రహీత, సాయిబాబా మెగా శిల్పశాల అధినేత బుర్రా శివ వరప్రసాద్ అద్బుతంగా రూపొందించిన ఈ కాంస్య విగ్రహాన్ని ప్రముఖ సినీదర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఆవిష్కరించారు.
ఇది ఒక కవికి ఇచ్చిన ఘన నివాళి. స్థానిక శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ (Konathala Ramakrishna) చొరవ, సహకారంతో ఈ చారిత్రాత్మక సంఘటన సాధ్యమైంది”. ఈ కార్యసాధనలో సహకరించిన కొణతాల రామకృష్ణ గారికి, సిరివెన్నెల కళాపీఠం వారికి, ఇతర అధికారులకు తానా (TANA) అధ్యక్షులు నరేన్ కొడాలి (Naren Kodali), కార్యవర్గసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇప్పుడు అదే పార్క్ లో విశాఖపట్నం (Visakhapatnam) మహానగర కార్పొరేషన్ వారు కేటాయించిన ₹39.70 లక్షల నిధులతో ‘సిరివెన్నెల స్మృతివనం’ కు శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు (Konidela Nagababu) బుధవారం సాయంత్రం 5 గంటలకు శంకుస్థాపన చెయ్యడం సంతోషం. సిరివెన్నెల కళాపీఠం, అనకాపల్లి వారి ఆధ్వర్యవంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు సత్యా గ్రాండ్ హాల్ లో జరుగనున్న సిరివెన్నెల జయంతి వేడుకలలో శ్రీ ఎం వి ఆర్ నిర్దేశకత్వంలో సిరివెన్నెల సంగీత విభావరి ఒక ప్రత్యేక ఆకర్షణ.
సిరివెన్నెల (Sirivennela Sitaramasastri) కుటుంబసభ్యులు, సిరివెన్నెల కళాపీఠం సభ్యులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సి.ఎం రమేష్ (C. M. Ramesh), శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, తానా పూర్వాధ్యక్షులు లావు అంజయ్య చౌదరి (Anjaiah Chowdary Lavu) మొదలైనవారు హాజరవుతున్న ఈ వేడుకలలో ప్రముఖ సినీగీత రచయిత శ్రీ భాస్కరభట్ల రవి కుమార్ (Bhaskarabhatla Ravi Kumar) కు ‘సిరివెన్నెల స్మారక’ పురస్కారం అందజేయనున్నారు. ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులే.