Connect with us

Financial

TANA Mid-Atlantic Chapter: ఆర్ధిక భదత్రపై అవగాహన పెంచేలా Will & Trust – Estate Planning సదస్సు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మిడ్ అట్లాంటిక్ టీమ్ తాజాగా నిర్వహించిన విల్ అండ్ ట్రస్ట్ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొన్నారు. దాదాపు 100 మందికిపైగా కుటుంబాలు తమ విల్ అండ్ ట్రస్ట్ (Will & Trust) పత్రాలను తమ భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవడంతో పాటు తమ సంతతి వారికి ఉప యోగపడేలా చేసుకున్నాయి. ఎస్టేట్ ప్లానింగ్ ప్రాముఖ్యతపై కూడా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు.

విల్ మరియు ట్రస్ట్ (Will & Trust) వంటి ముఖ్యమైన పత్రాలను కలిగి ఉండటం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం ద్వారా చాలామందికి తెలిసింది. ఈ కార్యక్రమం ద్వారా పలు సేవలను తానా టీమ్ అందించింది. నిపుణుల సలహాలు, ఉచిత నోటరీ సేవలు, ఉచిత డాక్యుమెంట్ ప్రింటింగ్, ఇతరత్రా సేవలను అందజేసింది.

విల్ మరియు ట్రస్ట్ (Will & Trust) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తమ మార్గదర్శకత్వాన్ని, నిరంతర సహకారాన్ని అందించిన తానా (Telugu Association of North America – TANA) నాయకత్వ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి (Dr. Naren Kodali), తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri), మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి (Phani Kantheti), తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించారు.

విల్ మరియు ట్రస్ట్ (Will & Trust) కార్యక్రమానికి సహకరించిన చుగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓస్టన్, తనిష్క్ యుఎస్ ఎ, స్ప్రింగ్ ఈగిల్స్ సంస్థలకు ఇతరులకు తానా మిడ్-అట్లాంటిక్ (TANA Mid-Atlantic Chapter) టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.

error: NRI2NRI.COM copyright content is protected