Duluth, Georgia: గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం(Greater Atlanta Telugu Association – GATA) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7, 2026న పికిల్‌బాల్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రీడా కార్యక్రమం డులూత్ లోని అట్లాంటా బ్యాడ్మింటన్ క్లబ్ (Atlanta Badminton Club – ABC) లో జరిగింది.
ఈ గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ (GATA) పికిల్ బాల్ టోర్నమెంట్లో మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్ విభాగాలలో పోటీలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో 100కి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ (GATA) చైర్మన్ సాయి గొర్రెపాటి (Sai Gorrepati), చీఫ్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి కలకోటి (Subbareddy Kalakoti), ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టోర్నమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించారు.
పోటాపోటీగా సాగిన ఈ పోటీల్లో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. ప్రతి విభాగంలో విజేతలకు మరియు రన్నర్స్‌కు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ (Pickleball Tournament) కు హాజరైన వారికి లైట్ టిఫిన్ మరియు వాటర్ ఏర్పాటు చేశారు.
2026 సంవత్సరంలో GATA నిర్వహించిన తొలి క్రీడా కార్యక్రమం కావడంతో ఈ పికిల్‌బాల్ టోర్నమెంట్ విశేష ఆదరణ పొందింది. ఈ సందర్భంగా GATA నాయకులుఈ క్రీడాకార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రీడాకారులకు, వాలంటీర్లకు మరియు స్పాన్సర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు రాము వెనిగండ్ల (Ramu Venigandla) మరియు సినీ నటులు వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) విజేతలకు మెడల్స్అందజేశారు. ఈ సందర్భంగా రాము వెనిగండ్ల మాట్లాడుతూ… క్రీడాకారులను, అట్లాంటా బ్యాడ్మింటన్ క్లబ్ యాజమాన్యాన్ని, గాటా నాయకులను క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు అభినందించారు.