Atlanta, Georgia: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగండ్ల రాము (Venigandla Ramu) అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యక్తిగత పర్యటనలో భాగంగా అట్లాంటా విచ్చేసిన రాము స్థానిక ఆల్ఫారెటా (Alpharetta) లో ఉన్న గేమ్ & గ్రిల్ ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ (Game & Grill – Fortius Sports Academy, AnTeRa) ని ఫిబ్రవరి 10న సందర్శించారు.
ముందుగా గేమ్ & గ్రిల్ ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ యాజమాన్యం వెనిగండ్ల రాము కి సాదర స్వాగతం పలికింది. అనంతరం ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ (Fortius Sports Academy) అంతటా కలియతిరుగుతూ, అక్కడ ట్రైనింగ్ ఇస్తున్న బాడ్మింటన్, పికిల్ బాల్ ఆటలకి ఏర్పాటుచేసిన కోర్టులు, కోచ్ ల వివరాలు అడిగితెలుసుకున్నారు.
ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ (Fortius Sports Academy) లో అమెరికా స్థాయిలో నిర్వహిస్తున్న టౌర్నమెంట్స్ వివరాలు నిర్వాహకులు రాముతో పంచుకున్నారు. రాము తన అట్లాంటా (Atlanta, Georgia) స్నేహితులు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ తో నిర్మించిన ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీలో సరదాగా కాసేపు బాడ్మింటన్ గేమ్ ఆడడం విశేషం.
ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మహా న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ… గుడివాడ (Gudivada) తన మొదటి ఇల్లు అయితే, అట్లాంటా (Atlanta) తన సెకండ్ హోమ్ అని, స్నేహితులను కలవడం, అలాగే వారు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీని నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు.
ప్రస్తుత కాలంలో స్పోర్ట్స్ ఆడుతూ ఫిట్నెస్ మైంటైన్ చేయడం చాలా అవసరమన్నారు. స్పోర్ట్స్ అంటే తనకు కూడా చాలా ఇష్టమని, అందుకే గుడివాడలో కూడా స్పోర్ట్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గుడివాడ (Gudivada) లోఉంటే అలసి పోవడం ఉండదని, గుడివాడ ప్రజలతో మమేకమవడం, అలాగే వారి సాధక బాధలు తెలుసుకొని చేయగలిగినంత సహాయం చేస్తున్నానన్నారు.
అలాగే మహా న్యూస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ల వంశీ (Marella Vamsi Krishna) గారితో తనకు చక్కని అనుబంధం ఉందని, వంశీ గారికి ఉన్న విజన్ చాలా గొప్పదని, ప్రతి కార్యక్రమంలోనూ ఎప్పూడూ కలుస్తుంటామని వెనిగండ్ల రాము (Venigandla Ramu) అన్నారు. కాకతాళీయకంగా అమెరికాలో కూడా మహా న్యూస్ తో మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు.
గేమ్ & గ్రిల్ ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీ (Game & Grill – Fortius Sports Academy, AnTeRa) లో జరిగిన ఈ కార్యక్రమంలో అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu), సతీష్ పూనాటి (Satish Punati), శ్యామ్ మల్లవరపు (Shyam Mallavarapu), శ్రీకాంత్ ఉప్పల, కిరణ్ గోగినేని, విజయ్ కొత్త, రమేష్ గుడే, విష్ణు వైదన, భాను, శ్రీధర్ కొర్రపాటి తదితరులు పాల్గొన్నారు.