Alpharetta, Georgia: ఫిబ్రవరి 8, 2026 తేదిన దేసాన మిడిల్ స్కూల్ (DeSana Middle School) లో సిలికానాంధ్ర మనబడి అల్ఫరెట్ట, రివర్‌డేల్, పీచ్ట్రీ సిటీ, హోలీ స్ప్రింగ్స్న్, డన్వుడి కేంద్రాల వారి పిల్లల పండుగ అంగరంగ వైభవంగ జరిగింది. 300 మంది పిల్లలు, వారి కుటుంబాలతో మొత్తం 1200 మంది కలసి పెద్ద వేడుకలాగ జరుపుకున్నారు.
జార్జియా (Georgia) రీజియన్ 1 SiliconAndhra ప్రాంతీయ సమన్వయకర్త నగేష్ దొడ్డక (Nagesh Doddaka) గారు అందరిని ఆహ్వనించి మనబడి పిల్లలని వేదిక మీదకు ఆహ్వానించారు. బడిలోని అందరు పిల్లలు శోభాయత్ర కార్యక్రమంలో పాల్గొనటంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది.
అటు పిమ్మట, జార్జియా పురోగతి సమన్వయకర్త విజయ్ రావిళ్ళ (Vijay Ravilla) గారు, ముఖ్య అదితిగా లక్ష్మి పద్మావతి గారి చేత ఉపాధ్యాయుల చేతుల మీదుగ బాలబడి చిట్టి పిల్లలకు భాషా జ్యోతిని అందించి, మన తెలుగు భాషా జ్యోతి ఆరకుండ చేస్తున ప్రయత్నాలను ప్రసంసించారు. మా తెలుగు తల్లి కి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బాలబడి చిన్నారులు, చిట్టి చిలకమ్మా, మా తాతగుండు, ఎర్రని పువ్వు మందార పువ్వు, బుడిబుడి నడకల పాట, ముద్దు ముద్దు అమ్మ పాట, కోతీ బావకి పెళ్ళంటా, ఎవరు ఎగిరేది, పలక నాది నల్లన, శబ్దాలు, జంతువుల అరుపుల పాట, జంతువుల పరిచయము, ముళ్ళు పోయి కత్తి వచ్చే పద్యం, ఆటలంటే మాకిష్టం పాటలతో ప్రేక్షకులను అలరించారు.
మాకు మేమె సాటి అంటూ, తెనాలి రామకృష్ణ, ఐకమత్యమే మహాబలం, పరమానందయ్య శిష్యుల కథ, రాజు గారి ఏడు చేపల కథ, జానపద నృత్యం, నా ప్యాంటు కధ, రాజకుమారి నాటకం, కోడిపిల్ల అమ్మను వెతికిన కధ, ద్రోణాచార్యుడు పరీక్ష, అంజమ్మ – కపిలయ్య, పంచతంత్ర కథ, నాయనా పులి వచ్చే నాటకాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకొని, భాషాభాగాల మీద పిల్లలకు ఉన్న విధ్వత్తుతో అబ్బుర పరిచారు.
కోపమునను, మన తెలుగు (Telugu) మన గర్వం, కష్టబెట్టబోకు, బ్రతికిననినాలు, తగిలినంతమేర, దొరఁలీదోచలేయరు, వీదుపరులవాడు, అడవిగాల్చువేళ, ఎప్పటికెయ్యది, గుమ్మడమ్మ గుమ్మాడి- లాంటి పద్యాలతో పిల్లలు శ్రోతల్ని ఆనంద పరిచారు.
ముఖ్యంగా దశావతారం, మనమెవ్వరం, స్వాతంత్ర సమరయోధుల ఏకపాత్రమభినయం లాంటి నాటకాలోతో అలరించి ప్రేక్షకులను అబ్బుర పరిచారు. అలంకారములతో నాటకం వేయచ్చు అనే ఆలోచనతో పిల్లలు తెలుగు భాష (Telugu Language) మీద ఉన్న వాళ్ళ పటిమను ప్రదర్శించారు.
అలాగే కార్యక్రమ వక్తలుగా (Anchors) మనబడి పూర్వ విద్యార్థి విద్యార్థినులు, సహస్ర, నిత్యా, శ్రీ, స్మ్రితి, విహాన్, శ్రీధరన్, అష్రిత్, అర్ణవ్, శ్రావ్య, ఇషాని, మహిక, జోషిత తమ తెలుగు ఉచ్చారణతో అందరి మనసులను ఆకట్టుకున్నారు.
మనబడికి ప్రాంతీయంగా సహకారాన్ని అందిస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (Telugu Association of Metro Atlanta – TAMA) బోర్డు చైర్మన్ మధుకర్ యార్లగడ్డ (Madhukar Yarlagadda), అధ్యక్షురాలు సునీత పొట్నూరు (Suneetha Potnuru), కాబోయే అధ్యక్షులు తిరు చిల్లపల్లి మరియు వారి కార్యవర్గం బృదం, మనబడి కార్యదర్శులైన నగేష్ దొడ్డాక, యశ్వంత్ జొన్నలగడ్డ, శ్రావణి పల్లపొలు, సుధీర్ కోట, విజయ్ కుమార్, ప్రియాంక నీలం గార్లను అభినందించి, అన్ని పట్టణాల నుంచి మనబడి ఉపధ్యాయులందరిని శాలువాలతో సత్కరించుకొన్నారు.
జార్జియా (Georgia) రీజియన్ 2 నుండి ప్రాంతీయ సమన్వయ కర్తలు సుచేత గారు, గౌరిధర్ గారు ఈ కార్యక్రమం లో పాల్గొని వారి సంఘీభావం తెలిపారు. చిన్నారుల నోటినుంచి వచ్చిన తెలుగు మధుర ప్రవాహంతో పిల్లల పండుగ చాల అద్భుతంగా, అనందంగా జరిగింది.
ఈ సిలికానాంధ్ర మనబడి పిల్లల పండుగ కార్యక్రమం విజయవంతంగా జరుపుకోవడనికి సహకరించిన అందరిని, ముఖ్యంగా ముందుకు వచ్చి సహయం అందించిన తల్లి తండ్రులుని యశ్వంత్ జొన్నలగడ్డ (Yashwanth Jonnalagadda) పేరు పేరున వేడుక చివర్లో అభినందించి ధన్యవాదలు తెలియ చేసారు.