Connect with us

Movies

బాలయ్య వి వి వినాయక్‌ కాంబినేషన్లో ఇంకో సినిమా

Published

on

నందమూరి బాలకృష్ణ వి వి వినాయక్‌ కాంబినేషన్లో ఇంకో సినిమా రాబోతుంది. వి.వి.వినాయక్‌ చెప్పిన కథ నచ్చడంతో మరియు ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ కాస్త ఆలస్యం అవ్వడంతో జైసింహా చిత్రాన్ని నిర్మించిన సి.కల్యాణ్‌ నిర్మాతగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని నిర్ణయించారు. మే 27న ఈ చిత్రం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. బాలకృష్ణ వినాయక్‌ల కలయికలో ఇంతకుముందు చెన్నకేశవరెడ్డి సినిమా వచ్చిన విషయం విదితమే. పూర్తి వివరాలకోసం అభిమానులు మరికొంతకాలం వేచిచూడక తప్పదు.