Connect with us

Sports

50+ టీమ్స్ తో Pickleball టోర్నమెంట్‌ విజయవంతం @ Alpharetta: TANA Atlanta Chapter

Published

on

జూన్‌ 22న గ్రేటర్‌ అట్లాంటా (Greater Atlanta) ప్రాంతం ఆల్ఫారెటా లోని ఫోర్టియస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ (Fortius Sports Academy) లో తానా మహాసభలను (TANA Convention) పురస్కరించుకుని జరిగిన తానా పికిల్‌బాల్‌ టోర్నమెంట్‌ విజయవంతమైంది. ఈ టోర్నమెంట్‌ లో 50కి పైగా టీమ్‌ లు పాల్గొన్నాయి.

పికిల్‌బాల్‌ టోర్నమెంట్‌ (Pickleball Tournament) విజయవంతానికి తానా నాయకులు, వలంటీర్లు కృషి చేశారు. తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) ఈ టోర్నమెంట్‌ నిర్వహణకు అవసరమైన దిశానిర్దేశం చేయగా, బోర్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ లావు (Srinivas Lavu) మార్గదర్శకత్వం చేశారు.

తానా కోశాధికారి భరత్‌ మద్దినేని, తానా ఫౌండేషన్‌ కోశాధికారి వినయ్‌ మద్దినేని, ఫౌండేషన్‌ కోశాధికారి ఫౌండేషన్‌ జాయింట్‌ కోశాధికారి కిరణ్‌ గోగినేని మరియు తానా సౌత్‌ ఈస్ట్‌ ప్రాంతీయ ప్రతినిధి మధుకర్‌ యార్లగడ్డ పికిల్‌బాల్‌ టోర్నమెంట్‌ (Pickleball Tournament) ను పర్యవేక్షించారు.

తానా (Telugu Association of North America – TANA) స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి టోర్నమెంట్‌ రూపకల్పనతోపాటు సజావుగా జరిగేలా చూశారు. చలమయ్య బచ్చు, లక్కీ, ఉదయ్‌ తదితరులు టోర్నమెంట్‌ విజయానికి అవసరమైన మద్దతును అందించారు.

వీరితోపాటు పికిల్‌బాల్‌ టోర్నమెంట్‌ (Pickleball Tournament) విజయానికి సహకరించిన తానా మహిళా సేవల సమన్వయకర్త సోహిని అయినాల, శశి దగ్గుల, చందు, లక్ష్మి, ఉదయ్‌, ఎజెలకు కూడా తానా (Telugu Association of North America – TANA) నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected