Connect with us

Sports

క్రీడా స్ఫూర్తితో చికాగో ఆంధ్ర సంఘం Pickleball పోటీలు @ Naperville, Illinois

Published

on

చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association – CAA) సెప్టెంబరు 22 ఆదివారం నాడు పికిల్ బాల్ పోటీలను (Pickleball Tournament) విజయవంతంగా Naperville Play N Thrive నందు నిర్వహించారు. బిగినర్స్ మరియు ఎడ్వాన్స్డ్ విభాగాలలో ఈ పోటీలను నిర్వహించారు.

సంస్థ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి (Swetha Kothapalli) మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు (Srinivas Pedamallu) గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి గారి సహకారంతో నరసింహరావు వీరపనేని గారి నేతృత్వంలో జరిగిన ఈ పోటీలలో 50 మందికి పైగా చికాగో (Chicago) వాసులు చక్కని క్రీడా స్ఫూర్తి తో పాల్గొన్నారు.

సంస్థ అభ్యున్నతిని ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్లకు, Play N Thrive యాజమాన్యానికి మరియు సంస్థ సభ్యులకు చికాగో ఆంధ్ర సంఘం (CAA) వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీల విజయానికి బోస్ కొత్తపల్లి, ఆర్తీ శ్రీనాధ్, నందన్ నండూరి, శ్రియా కొంచాడ, ధీరజ్ ఐనపూడి, సురేశ్ కుమార్ ఐనపూడి, ఆశ్రిత్ కొత్తపల్లి కృషి చేశారు.

ఈ పోటీల్లో విజేతలు మరియు రన్నర్-అప్ లకు సంస్థ స్పాన్సర్లు ఆల్ స్టేట్ (AllState) నుండి ఆసిం హమీది, గ్రేడ్ పవర్ (Grade Power) నుండి ఆలెక్స్, మేడా డెంటల్ (Meda Dental) డా॥. సత్య గారు, స్కంద జ్యూయలర్స్ రాజ్ & సవత మునగ ప్రభృతులు విచ్చేసి బహుమతులు (Prizes) అందజేసారు.

ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు, పోటీల నిర్వహణకు తమ సహకారాన్నందించిన కార్యకర్తలకు సంస్థ (Chicago Andhra Association – CAA) కార్యనిర్వాహక బృందం వారు పిజ్జాలు, అల్పాహారం అందించారు. మంచి ప్రణాళికతో నిర్వహించిన ఈ పోటీలకు మంచి స్పందన రావడం నిర్వాహకులను సంతోష పరచింది.

సంఘ బోర్డు సభ్యులు శ్రీనివాస్ పద్యాల, శ్రీకృష్ణ మతుకుమల్లి, మురళీ రెడ్డివారి, హేమంత్ తలపనేని, శైలజ సప్ప, శ్రీస్మిత నండూరి, తమిశ్ర కొంచాడ, పద్మారావు అప్పలనేని, నరేశ్ కుమార్ చింతమాని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, గిరి రావు కొత్తమాసు, సవిత మునగ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected