జార్జియా రాష్ట్రం, అట్లాంటా (Atlanta) కి చెందిన డా. దామోధర్ నేరెళ్ల (Dr. Damodhar Nerella) ప్రజల ఆరోగ్యం కోసం దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఆరోగ్య సూచనలు, సలహాలు ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అమెరికాలో డాక్టర్ గా బాగా డబ్బులు సంపాదించే అవకాశం ఉన్నా సరే, తన విలువైన సమయాన్ని ఇలా వెచ్చించడం అభినందనీయం.
ప్రస్తుతం వర్షాలు పడుతూ వైరస్లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా Chikungunya మరియు MonkeyPox Virus లు అందరినీ కలవరపెడుతున్నాయి. ఇందులో భాగంగా Chikungunya మరియు MonkeyPox తదితర వైరస్ ల కారణాలు, ట్రీట్మెంట్ మరియు జాగ్రత్తల గురించి డా. దామోధర్ నేరెళ్ల (Dr. Damodhar Nerella) విపులంగా వివరించారు.