Connect with us

Government

Atlanta: ఇంకా వరస్ట్ కానున్న జార్జియా 400 & ఇంటర్స్టేట్ 285 ట్రాఫిక్

Published

on

Photo Curtesy: Georgia DOT

అట్లాంటా వాసులకు ప్రత్యేకంగా డౌన్టౌన్ లో ఉద్యోగం చేసేవాళ్లకు జార్జియా 400 మరియు ఇంటర్స్టేట్ 285 ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జార్జియా 400, ఇంటర్స్టేట్ 285 ఇంటర్చేంజ్ ప్రాజెక్ట్ కొన్ని సంవత్సరాలుగు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్స్టేట్ 285 కి రెండు వైపులా, రోస్వెల్ రోడ్ నుండి యాష్ఫోర్డ్ డన్వుడీ రోడ్ వరకు రెండు లైన్స్ తగ్గించనున్నట్లు జార్జియా రవాణా శాఖ తెలియజేసింది. ఈ లైన్స్ మూసివేతలు వచ్చే లేబర్ డే వీకెండ్ తర్వాత నుండి జూన్ 2022 వరకు ఉండేలా ప్రణాళిక తయారుచేస్తున్నారు. కాబట్టి జార్జియా 400 & ఇంటర్స్టేట్ 285 ఇంటర్చేంజ్ ట్రాఫిక్ ఇంకా వరస్ట్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ ఇంటర్చేంజ్ ట్రాఫిక్ ని తప్పించుకోవాలంటే ఉదయం ముందుగానే ఆఫీస్ కి వెళ్లి సాయంత్రం త్వరగా బయలుదేరితే మంచిదని అభిప్రాయపడుతున్నారు మెట్రో అట్లాంటా వాసులు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected