Connect with us

Devotional

తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీనివాస కల్యాణోత్సవం @ అట్లాంటా హిందూ టెంపుల్, July 9th 2022

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీనివాస కల్యాణోత్సవం గురించి అందరికీ తెలిసిందే. అలాగే అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న చాలామంది తెలుగువారు ఇండియా వెళ్ళినప్పుడు తిరుపతి సందర్శించి కల్యాణోత్సవంలో కూడా పాల్గొనడం సహజం.

మరి అలాంటి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవం అట్లాంటాలో నిర్వహిస్తున్నారు. అట్లాంటాలో ఉంటున్న భక్త మహాశయులందరికీ శుభవార్త ఇది. ఏపీఎన్నార్టీ సొసైటీ స్థానిక లాభాపేక్షలేని సంస్థలతో కలిసి తిరుపతి నుంచి తీసుకువచ్చే విగ్రహాలతో ఈ శ్రీనివాస కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు.

హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో వచ్చే జులై 9న ఉదయం 7 గంటల నుండి నిర్వహించే ఈ పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ శ్రీనివాసుని ఆశీస్సులు అందుకోవాలని మనవి చేస్తున్నారు నిర్వాహకులు. మరిన్ని వివరాలకు పై ఫ్లయర్ చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected