Connect with us

Concert

నవంబర్ 11న మణిశర్మ మ్యూజికల్ నైట్ @ తామా దివ్య దీపావళి: Alpharetta, Georgia

Published

on

అట్లాంటా తెలుగు సంఘం (Telugu Association of Metro Atlanta) ‘తామా’ వారు నవంబర్ 11 శనివారం రోజున దివ్య దీపావళి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆల్ఫారెటా (Alpharetta) లోని డెన్మార్క్ హై స్కూల్ (Denmark High School) ఈ వేడుకలకు వేదిక కానుంది. ఈ దివ్య దీపావళి వేడుకలలో ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ లైవ్ మ్యూజికల్ నైట్ హైలైట్ అవ్వనుంది.

ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన తెలుగు సినీ సంగీత దర్శకులు మణిశర్మ (Mani Sharma) తన ట్రూప్ తో అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అట్లాంటా (Atlanta) వస్తున్నారు. ఈ ట్రూప్ లో మణిశర్మ (YVS Sharma) తోపాటు గాయనీగాయకులు వైష్ణవి, శృతిక, స్వరాగ్, పవన్ తదితరులు ఉన్నారు. అలాగే కమెడియన్ జబర్దస్త్ నవీన్ అలరించనున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్ స్టాల్స్, ర్యాఫుల్ బహుమతులు, మెహందీ, చక్కని పండుగ విందు భోజనం, జబర్దస్త్ షో, ఫ్రీ మెహందీ వంటి మరెన్నో హైలైట్స్ ఉన్నాయి. సరదా యాంకరింగ్ తో అలరించే సినిమా పిచ్చ ఫేమ్ యాంకర్ దిలీప్ (Dilip) కూడా ఈ తామా (Telugu Association of Metro Atlanta) దివ్య దీపావళి కార్యక్రమానికి విచ్చేయనున్నారు.

టికెట్స్ కొరకు www.NRI2NRI.com/TAMA Divya Deepavali 2023 ని సందర్శించండి. ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ రేట్లు నవంబర్ 6 వరకు మాత్రమే. కావున త్వరగా టికెట్స్ కొనుక్కోవలసిందిగా తామా (TAMA) కార్యవర్గ సభ్యులు కోరుతున్నారు. స్టాల్ల్స్ రెజిస్ట్రేషన్ కొరకు పై లింక్ లేదా ఫ్లయర్ లో ఉన్న వారిని సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected