Connect with us

Bathukamma

TTA చార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న బతుకమ్మ వేడుకలు

Published

on

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా అమెరికాలోని పలు నగరాలలో బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నార్త్ కేరోలినా రాష్ట్రం, చార్లెట్ నగరంలో TTA చార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 శనివారం రోజున స్థానిక షిర్డీ సాయి బాబా గుడిలో బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు.

వచ్చే శనివారం సాయంత్రం 3 గంటల నుండి ఘనంగా నిర్వహించే ఈ బతుకమ్మ వేడుకలకు చార్లెట్ సిటీ కౌన్సిల్ మెంబర్ డింపుల్ అజ్మీరా ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. జానపద పాటలు, నృత్యాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు, డీజే మ్యూజిక్, ఉచిత పండుగ భోజనం అందరినీ ఆకట్టుకోనున్నాయి.

ఈవెంట్ రెజిస్టర్ చేసుకోవడానికి https://NRI2NRI.com/TTACharlotteBathukamma2022 ని సందర్శించండి. టిటిఎ నేషనల్ లీడర్షిప్ సహకారంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నిషాంత్ సిరికొండ, రీజినల్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి కొత్తూర్, అడ్వైజర్స్ నవీన్ మల్లిపెద్ది & గోపాల్ కాసర్ల మరియు TTA చార్లెట్ చాప్టర్ టీం అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న బతుకమ్మ వేడుకలకు చార్లెట్ లోని తెలుగువారందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు. మరిన్ని వివరాలకు పై ఫ్లయర్ చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected