Connect with us

Education

కాలిఫోర్నియా మిల్పిటాస్ పాఠశాలకు తానా బ్యాక్‌ప్యాక్ ల అందజేత

Published

on

పాఠశాల విద్యార్థులకు మద్దతు ఇవ్వడం మరియు స్థానిక కమ్యూనిటీకి సహాయం చేయడం అనే సంప్రదాయాన్ని కొనసాగించడంలో భాగంగా ‘తానా’ నార్తర్న్ కాలిఫోర్నియా బృందం (శాన్ ఫ్రాన్సిస్కొ, బే ఏరియా) మిల్పిటాస్ లోని రాబర్ట్ రాండాల్ ఎలిమెంటరీ స్కూల్‌లో బ్యాక్‌ప్యాక్‌లను పంపిణీ చేసింది.

250 కి పైగా బ్యాక్ ప్యాక్‌లను ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఉదారంగా విరాళంగా అందించినందుకు స్కూల్ మేనేజ్‌మెంట్ (కో-ప్రిన్సిపల్స్ శ్రీమతి క్రిస్టన్ & శ్రీమతి క్లాడియా) మరియు స్టూడెంట్ కౌన్సిల్ (ప్రెసిడెంట్ కైకో అండ్ టీమ్) చాలా సంతోషించారు.

ఈ సందర్భంగా బ్యాక్‌ప్యాక్ విరాళ కార్యక్రమం ద్వారా పాఠశాలకు తమ నిరంతర మద్దతు కొనసాగిస్తున్నందుకు తానా నార్తర్న్ కాలిఫోర్నియా బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ బ్యాక్‌ప్యాక్ ఈవెంట్‌ను గ్రాండ్‌ సక్సెస్ చేసినందుకు తానా తరుపున రామ్ తోట అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected