Connect with us

Education

‘తానా చేయూత’ లో భాగంగా పేద విద్యార్థికి ల్యాప్టాప్

Published

on

రవి సామినేని, తానా ఫౌండేషన్ ట్రస్టీ, మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం ఇండియా ట్రిప్ లో ఉన్న రవి పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తిరువూరు వాహినీ ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుతున్న పేద విద్యార్థికి ల్యాప్టాప్ ను సహాయంగా అందించారు.

సుమారు 50 వేల రూపాయల ఖరీదైన ల్యాప్టాప్ ను డొనేట్ చేసి, తన చదువుకు ఉపయోగపడుతున్న రవి సామినేని మరియు తానా నాయకులకు నాగ భరత్ వెలమాటి కృతఙ్ఞతలు తెలిపారు. ‘తానా చేయూత’ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 14న ఈ సహాయం చేశామని రవి సామినేని అన్నారు.