Connect with us

Associations

బాలవికాస కేంద్రాల శిక్షకులకు ఉపకార వేతనాల పంపిణి

Published

on

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుక బడిన జిల్లాగా శ్రీకాకుళం జిల్లాకు పేరు. జిల్లాలో రాజాం నియోజకవర్గ పరిధిలో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదువుతున్నపేద పిల్లలకు విలువలతో కూడిన విద్యను ఉచితంగా అందివ్వాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ వారు బాలవికాస కేంద్రాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ బాలవికాస కేంద్రాలలో 10వ తరగతి వరకు శిక్షణ ఇస్తున్నారు. ఈ బాలవికాస కేంద్రాలను శిక్షణ పొందిన, సేవా గుణం కలిగిన విద్యార్థులను ట్రైనర్లుగా మార్చి వారి పర్యవేక్షణలో నడుపుతున్నారు.

బాలవికాస కేంద్రాలలో 15 మంది ట్రైనర్లకి పదివేల రుపాయలు వారి చదువుకొరకు రాజా కసుకుర్తి సమకూర్చిన స్కాలర్షిప్స్ అందించటం జరిగింది. తానా అద్యక్షులు లావు అంజయ చౌదరి మరియు నగర ప్రముఖుల చెతులమీదగ స్కాలర్షిప్స్ అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected