Connect with us

Elections

నామినేషన్ల ఉపసంహరణ అనంతర జాబితా, పెద్దగా వెనక్కి తగ్గని ఇరు వర్గాలు: TANA

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) లో ఎన్నికల సమరం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గత మార్చి 7న ఎలక్షన్ కమిటీ (Election Committee) నామినేషన్ల జాబితా ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం 40 పదవులకు 96 నామినేషన్లు వచ్చాయి. ముఖ్యంగా నరేన్ కొడాలి మరియు శ్రీనివాస్ గోగినేని ప్యానెల్స్ మధ్య పోటీ నడుస్తుంది.

మార్చి 10తో నామినేషన్ల ఉపసంహరణ గడువు (Withdrawal Deadline) ముగియడంతో అడపా దడపా ఉపసంహరించుకున్న కొద్దిమందిని తొలగించి ఫైనల్గా పోటీలో ఉన్న పోటీదారుల జాబితా (Final Contestants List) ని ఎలక్షన్ కమిటీ ఈరోజు ప్రకటించినట్లు తెలిసింది. మొత్తంగా 96 మందిలో 9 మంది తమ నామినేషన్ ఉపసంహరించుకోగా, 40 పదవులకు 87 మంది పోటీలో మిగిలినట్లు తెలిసింది.

కాకపోతే తదుపరి ఏంటి అనేదానిపై ఎలక్షన్ కమిటీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. సమయం తక్కువ ఉన్నప్పటికీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళతారా? లేక మార్చి 23న కోర్టు కేసు తీర్పు కోసం వేచి చూస్తారా? లేదా కొత్త షెడ్యూల్ ప్రకటిస్తారా? వంటి ప్రశ్నలకు సమాధానం లేదు.

అందునా ఇప్పటి వరకు తానా (TANA) చరిత్రలో ఎప్పుడూ నిర్వహించని సవాలుతో కూడిన ఎలక్ట్రానిక్ వోటింగ్ (Electronic Voting) పద్దతిలో ఈ ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రణాళిక రచిస్తున్నారని విశ్వసనీయవర్గాల భోగట్టా. పలు కోర్టు కేసులు నడుస్తుండడంతో గత ఎన్నికల వలే నెలలపాటు సాగదీస్తారా లేక త్వరగా తేలుస్తారా అనేది తెలియాలంటే ఎలక్షన్ కమిటీ నోరు విప్పాల్సిందే.

కానీ ఇప్పటికే రెండు వర్గాలలోని ఎక్కువ శాతం మంది తమ తమ (Election Campaign) ప్రచారంలో ముందుగు సాగుతున్నారు. ప్రచారంలో ఎక్కడ వెనక పడతామేమో అనే కలవరంతో తప్పని పరిస్థితుల్లో ముందుకే అడుగేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతర జాబితా కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected