Connect with us

Events

ఏప్రిల్ 9న బంతి భోజనాలతో ‘తామా’ ఉగాది ఉత్సవాలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ ఉగాది ఉత్సవాలు ఏప్రిల్ 9 శనివారం రోజున నిర్వహిస్తున్నారు. కమ్మింగ్ నగరంలోని డెన్మార్క్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఈ ఉగాది ఉత్సవాలలో తామా సిగ్నేచర్ సహపంక్తి భోజనాలు ప్రత్యేకం. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇండియా నుంచి ఫ్రెష్ గా తెప్పిస్తున్నారు.

ఫోర్సైత్ కౌంటీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ వెస్ మెకాల్ ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్ స్టాల్ల్స్, క్యూరీ లెర్నింగ్ పోటీలు, ర్యాఫుల్ బహుమతులు, సంగీత విభావరి లతో ఈ ఉత్సవాలకు ప్లాన్ చేస్తున్నారు. గాయనీ గాయకులు అఖిల, సందీప్, శ్రీకాంత్ మరియు యాంకర్ సమీరా అందరినీ అలరించనున్నారు.

టిక్కెట్స్ కొరకు WWW.TAMA.ORG/UGADI వెబ్సైటుని సంప్రదించండి. అడ్డా రెస్టారెంట్ నుంచి పసందైన వంటకాలతో అందరికీ ఇండియాలో బంతి భోజనాలు తరహా వాతావరణం సృష్టించేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఆ మెన్యూ చూస్తేనే నోరూరుతుంది. ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఏప్రిల్ 4 వరకు మాత్రమే. కాబట్టి త్వరగా మీ టిక్కెట్స్ బుక్ చేసుకోండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected