Connect with us

Events

భక్త ప్రహ్లాద నాటకం, మిమిక్రీ, శ్రీముఖితో ముఖాముఖి @ తామా సంక్రాంతి సంబరాలు

Published

on

అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు ఈ శనివారం జనవరి 29న నిర్వహిస్తున్నారు. రవి కల్లి అధ్యక్షునిగా, శ్రీరామ్ రొయ్యల ఛైర్మన్ గా జనవరి 1 నుంచి 2022 సంవత్సరానికిగాను కార్యవర్గ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరి ఆధ్వర్యంలో మొట్టమొదటి సాంస్కృతిక కార్యక్రమం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడానికి ప్రణాళిక తయారుచేసారు.

ప్రముఖ యాంకర్ శ్రీముఖి, మిమిక్రీ రమేష్, సురభి డ్రామా థియేటర్ వారి భక్త ప్రహ్లాద నాటకం, ముగ్గుల పోటీ, పంచె కట్టు పోటీ, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించనున్నాయి. శేఖర్ రియాల్టీ, ఐ డి డబ్ల్యూ టీం మరియు మై టాక్స్ ఫైలర్ ఈ సంబరాలకు సమర్పకులు.

జనవరి 29 శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగే ఈ ఆన్లైన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొనాలంటే www.tama.org/sankranthi లో మీ పేరు నమోదు చేసుకోండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected