Connect with us

News

చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలిపిన ఫిలడెల్ఫియా ప్రవాసులు @ Evansburg State Park

Published

on

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత నారా చంద్రబాబు నాయుడు ని అక్రమంగా ఈరోజు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు ఫిలడెల్ఫియా ప్రవాసులు నిరసన తెలుపుతూ టీడీపీ అధినేతకు మద్దతుగా నిలిచారు.

ఫిలడెల్ఫియాలోని స్థానిక ఇవాన్స్బర్గ్ స్టేట్ పార్క్ (Evansburg State Park, Montgomery County) లో సమావేశమై ప్రొటెస్ట్ చేశారు. స్టాప్ సీబీఎన్ ఇల్లీగల్ అరెస్ట్, సేవ్ ఆంధ్రప్రదేశ్, సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. అలాగే ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.

మహళలు, పెద్దలు, పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ నిరసన (Protest) కార్యక్రమంలో చంద్రబాబు (Nara Chandrababu Naidu) కు మద్దతుగా ఎన్నారై టీడీపీ నాయకులతోపాటు స్థానిక తెలుగు ప్రవాసులు విరివిగా పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected