Connect with us

Donation

బసవతారకం హాస్పిటల్ కు వీల్ ఛైర్లు అందించిన పొట్లూరి రవి

Published

on

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. 76వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రముఖ ఎన్నారై పొట్లూరి రవి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు ముప్పై వీల్ ఛైర్లు అందించారు.

ఈరోజు జరిగిన కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ద్వారా వీల్ చైర్లని హాస్పిటల్ కి అందించారు. పొట్లూరి రవి కుటుంబసభ్యులని సాదరంగా ఆహ్వానించిన బాలకృష్ణ, హాస్పిటల్ లోని ఐదువందలకు పైగా రోగులకు బ్రెడ్ పాకెట్స్ పంపిణీ చేశారు.

చేతన ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ చైర్మన్ రవి వెనిగళ్ల, కోఆర్డినేటర్ రంగారావు, ముప్పా రాజశేఖర్, పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఆగష్టు 15, స్వాతంత్ర దినోత్సవం రోజున మరోసారి దాతృత్వాన్ని చాటిన పొట్లూరి రవి ని ఇటు నందమూరి అభిమానులు అటు బసవతారకం హాస్పిటల్ సిబ్బంది అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected